HomeNewsAndhra Pradeshవైసీపీలో ఇన్ ఛార్జిల మార్పు.. దేనికి సంకేతం?

వైసీపీలో ఇన్ ఛార్జిల మార్పు.. దేనికి సంకేతం?

Published on

రాజీనామాల వరకు వెళ్లిన ఇన్‌చార్జిల వ్యవహారం దేనికి సంకేతం..?
బంధువులు, సన్నిహితులే జగన్‌కు ఎందుకు దూరమవుతున్నారు..?
ఏపీ వైసీపీలో అసలేం జరుగుతోంది?
తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్ వైసీపీపై పడిందా?
సిట్టింగ్ లకు ఫిట్టింగ్ తప్పదా?
తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్ వైసీపీపై పడిందా?

వైసీపీలో కొత్త ఇన్‌చార్జుల నియామకం చిచ్చు రాజుకుంది. 11మంది ఇన్ ఛార్జిలను మార్చడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. రేపల్లె ఇన్‌చార్జిగా డాక్టర్ ఈవూరు గణేష్‌ను వైసీపీ అధిష్టానం నియమించింది. అయితే గణేష్ నియామకాన్ని ఎంపీ మోపిదేవి వర్గం వ్యతిరేకిస్తోంది. అర్థరాత్రి రేపల్లెలో మోపిదేవి అనుచరులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు. మోపిదేవికి మద్దతుగా పలువురు వైసీపీ కౌన్సిలర్ల రాజీనామాకు సిద్ధమయ్యారు. రేపల్లెకు కొత్త ఇన్‌చార్జ్ నియామకంపై అధిష్టానం పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు.

జగన్ కి నమ్మినబంటుగా ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకరబాబు, టీడీపీ నుంచి వచ్చిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌కు, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో పాటు ఆయన కుమారుడు, ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి తిప్పల దేవన్‌రెడ్డికి కూడా మొండిచేయి చూపారు. 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జులను ప్రకటించగా.. వీరిలో వైద్య ఆరోగ్య మంత్రి రజనిని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమకు.. సాంఘిక సంక్షేమ మంత్రి మేరుగ నాగార్జునను వేమూరు (ఎస్సీ) నుంచి సంతనూతలపాడు (ఎస్సీ)కి.. మున్సిపల్‌ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ను యర్రగొండపాలెం నుంచి కొండపికి మార్చారు. ప్రత్తిపాడు (ఎస్సీ) ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి మేకతోటి సుచరితను.. తాడికొండ (ఎస్సీ)కి ఇన్‌చార్జిగా నియమించారు. చిలకలూరిపేటకు మల్లెల రాజేశ్‌నాయుడు, అద్దంకికి పాణెం హనిమిరెడ్డి.. మంగళగిరికి గంజి చిరంజీవి, రేపల్లెకు డాక్టర్‌ ఈవూరు గణేశ్‌, గాజువాకకు వరికూటి రామచంద్రరావు, వేమూరుకు అశోక్‌బాబు, ప్రత్తిపాడుకు బాలసాని కిరణ్‌కుమార్‌ కొత్త ఇన్‌చార్జులుగా నియమితులయ్యారు. ఈ పరిణామం వైసీపీని కుదిపివేస్తోంది.అసలేం జరుగుతోందనే చర్చ సాగుతోంది.

Latest articles

More like this