HomeEntertainmentFilm Newsవిలక్షణ నటుడు చంద్రమోహన్ ఇకలేరు..ప్రముఖుల నివాళి

విలక్షణ నటుడు చంద్రమోహన్ ఇకలేరు..ప్రముఖుల నివాళి

Published on

తెలుగు చిత్రసీమను విషాదాలు వెన్నంటుతున్నాయి. సీనియర్ నటులు ఒక్కొక్కరూ వీడిపోతున్నారు. తాజాగా సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు.ఆయనకు 82 ఏళ్ళు. కృష్ణాజిల్లాలోని పమిడిముక్కల గ్రామంలో 1943 మే,23 జన్మించిన ఆయన ‘రంగుల రాట్నం’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. హీరోగా, కమెడీయన్ గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. సిరిసిరిమువ్వ’, ‘శంకరాభరణం’, ‘రాధాకళ్యాణం’, ‘నాకూ పెళ్ళాం కావాలి’ లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్యమైన నటనా కౌశలం ద్వారా తెలుగువారి మనస్సులో చెరగని ముద్ర వేశారు చంద్రమోహన్. ఆయన 932 చిత్రాల్లో నటించారు. నా తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’లో మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన అందరి ప్రశంసలు అందుకుంది.

చంద్రమోహన్ తమిళ సినిమాల్లోనూ నటించారు. తన నటనకు గానూ ఫిలింఫేర్‌, నంది అవార్డులు అందుకున్నారు. 1987లో ‘చందమామ రావే’ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు, 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా రెండు నంది పురస్కారాలు దక్కాయి ‘పదహారేళ్ల వయసు’, ‘సిరి సిరి మువ్వ’ సినిమాల్లో నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డులు దక్కాయి. చంద్రమోహన్ లేరన్న వార్త పలువురిని దిగ్బ్రాంతికి గురిచేసింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎన్టీఆర్, బాలయ్య, కె.రాఘవేంద్రరావు సంతాపం తెలిపారు.చంద్రమోహన్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం బాధాకరం, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం అన్నారు. నటులు చిరంజీవి, నందమూరి కల్యాణ్ రాం, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, వెంకటేష్ నివాళులు అర్పించారు. చంద్ర మోహన్ కన్ను మూశారని తెలిసి ఆవేదన చెందాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.. ఆయన్ని తెరపై చూడగానే మనకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తినో, మన బంధువునో చూస్తున్నట్లు అనిపించేది. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన నటనను చూపించారు. పదహారేళ్ళ వయసు, సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి, రాధా కళ్యాణం లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. చంద్ర మోహన్‌తో మా కుటుంబానికి స్నేహ సంబంధాలు ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులలో అన్ని తరాలవారికి చంద్రమోహన్ చేరువయ్యారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అన్నారు నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. చంద్రమోహన్ భౌతిక కాయానికి సోమవారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Latest articles

More like this