ఆకాశంలో అద్భుతం జరగనుంది. బుధవారం రాత్రి చందమామ భూమికి మరింత దగ్గరగా రానుంది. సాధారణ పౌర్ణమి కంటే మరింత పెద్దదిగా, 16ు ప్రకాశవంతంగా కనువిందు చేయనుంది. అందుకే దీన్ని సూపర్ బ్లూ మూన్ అంటారు. అంటే ఇది నీలం రంగులో ఉండదు. ఒక నెలలో రెండోసారి పౌర్ణమి వచ్చింది కాబట్టి దాన్ని బ్లూ మూన్ అని పిలుస్తారు.మన ఆకాశమే ఒక అద్భుతం. అప్పుడప్పుడూ మనకు గ్రహణాలు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఆకాశంలో ఇవాళ ఒక అద్భుతం జరగనుంది. బుధవారం రాత్రి చందమామ భూమికి మరింత దగ్గరగా రానుంది.
సాధారణ పౌర్ణమి కంటే మరింత పెద్దదిగా, 16 రెట్లు ప్రకాశవంతంగా కనువిందు చేయనుంది. అందుకే దీన్ని సూపర్‌బ్లూ మూన్‌అంటారు. అంటే ఇది నీలం రంగులో ఉండదు. ఒక నెలలో రెండోసారి పౌర్ణమి వచ్చింది కాబట్టి దాన్ని బ్లూ మూన్‌అని పిలుస్తారు. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్‌మూన్స్‌ఏర్పడుతుంటాయి.. కానీ, బుధవారం ఏర్పడబోయే బ్లూమూన్‌మాత్రం అరుదైనది. పౌర్ణమి సమయంలో చందమామ భూమికి దగ్గరగా వచ్చిన సూపర్‌మూన్‌ఆవిష్కృతమవుతుంది. బ్లూ బూన్2009 డిసెంబర్‌లో ఏర్పడగా మళ్లీ 2032, 2037 ఆగస్టులో ఏర్పడబోతుంది.