HomeNewsతెలంగాణలో బ్రదర్స్ విక్టరీ నల్లగొండలో కోమటిరెడ్డి.. ఆదిలాబాద్ జిల్లాలో గడ్డం బ్రదర్స్ కి విజయం

తెలంగాణలో బ్రదర్స్ విక్టరీ నల్లగొండలో కోమటిరెడ్డి.. ఆదిలాబాద్ జిల్లాలో గడ్డం బ్రదర్స్ కి విజయం

Published on

తెలంగాణ ఎన్నికల్లో బ్రదర్స్ విజయం సాధించారు. అటు గడ్డం బ్రదర్స్ వినోద్, వివేక్ తో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ఘన విజయం సాధించారు. గ‌డ్డం వివేక వెంక‌ట స్వామి, చెన్నూరులో, వినోద్ వెంక‌ట స్వామి బెల్లంపల్లి లో విజయం సాధించారు.చెన్నూరులో గడ్డం వివేక్ కి 37 వేల 189 ఓట్ల మెజారిటీ లభించగా.. బెల్లంపల్లిలో గడ్డం వినోద్ కూడా మెజారిటీతో గెలిచారు. ఈ సందర్భంగా గ‌డ్డం వినోద్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను ఇక్క‌డే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇల్లు కట్టుకుంటాన‌ని ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అంద‌జేస్తాన‌ని చెప్పారు.

ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ తో పాటు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ఆయ‌న భార్య పద్మావతి విజయం సాధించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ నుంచి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి విజయం సాధించారు. మునుగోడులో 21 వేల ఓట్లతో కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. అయితే, ఇటీవ‌ల ఆయ‌న కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఉప ఎన్నిక‌లో ఓడిపోయారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. రాజ్ గోపాల్ రెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన త‌ర్వాత కాంగ్రెస్ తరుపు నుంచి 2009లో భువనగిరి లోకసభ నియోజకవర్గం నుంచి పోటి చేసి ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యేగా కూడా ఆయ‌న ప‌నిచేశారు. 2016-2018 వరకు కోమ‌టి రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2018లో మునుగోడు అసెంబ్లీ నుంచి గెలిచారు.నల్గొండ జిల్లాలో తొలి ఫలితం కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చింది. నల్గొండలో ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డిపై ఆయన సుమారు 54 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.

బర్రెలక్క కు ఆశించిన ఓట్లు వచ్చాయా?

నిరుద్యోగ అభ్యర్థుల ప్రతినిధిగా తెలంగాణ అసెంబ్లీ బరిలో దిగిన బర్రెలక్క పోస్టల్ బ్యాలెట్ లో మాత్రం ముందంజలో కొనసాగారు. తర్వాత వచ్చిన రౌండ్లలో ఆమెకి ఓట్లు అంత భారీగా పడలేదు. తన నామినేషన్ తో దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఉద్యోగులు బర్రెలక్క వెంటే నిలిచినట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తెలుస్తోంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈమె పోటీ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. కొల్లాపూర్ లో కాంగ్రెస్ తరపున జూపల్లి కృష్ణ రావు, బీ ఆర్ ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తొలిరౌండ్ లో 473, రెండవ రౌండ్ లో 262 ఓట్లు పోలయ్యాయి. కొల్లాపూర్ లో 6 వ రౌండ్ ముగిసరికి 1200 ఓట్లు బర్రెలక్క కి వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ బాక్సులో దూసుకుపోయిన బర్రెలక్క.. తర్వాత ఓట్ల లెక్కింపులో క్రమంగా వెనుకబడ్డారు. ఉద్యోగులు బర్రెలక్క వెంటే నిలిచినట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చూస్తుంటే అర్థమవుతోంది. బర్రెలక్కకు ఉన్న క్రేజ్ ఓటు బ్యాంకుగా మారలేదని స్పష్టంగా కనిపిస్తుంది. బర్రెలక్క ఎన్నికలలో విజయం సాధించకపోయినా కనీసం 15 వేలు నుంచి ఇర‌వై వేల ఓట్లు వ‌స్తాయి అని భావించినా అది కుద‌ర‌లేదని తెలుస్తుంది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిన బర్రెలక్క కు దేశ విదేశాల నుంచి మద్దతు లభించినప్పటికీ, స్థానికంగా ఉన్న కొల్లాపూర్ ప్రజలు మాత్రం బర్రెలక్కకు మద్దతు ఇవ్వలేదు అనేది కౌంటింగ్ ద్వారా సుస్పష్టంగా తెలుస్తుంది.

Latest articles

More like this