HomeNewsపటేల్ రమేష్ రెడ్డికి రేవంత్ బంపర్ ఆఫర్

పటేల్ రమేష్ రెడ్డికి రేవంత్ బంపర్ ఆఫర్

Published on

సూర్యాపేట టికెట్ దక్కకపోవడంతో పటేల్ రమేష్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టాన దూతలపై సూర్యాపేట కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డి రివర్స్ ఎటాక్ చేశారు. నామినేషన్ ఉపసంహరించుకుని కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని, బుజ్జగించేందుకు రమేష్ రెడ్డి ఇంటికి వెళ్ళిన అధిష్టాన పెద్దలు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, మల్లు రవికి చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ అగ్ర నేతల ముందు భోరున విలపించిన రమేష్ రెడ్డి. తనకు రెండోసారి హ్యాండ్ ఇచ్చారని రమేష్ రెడ్డి ఆవేదన చెందారు. ఫార్వాడ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తనకే మద్దతు ఇవ్వాలని అధిష్టాన పెద్దలను విజ్ఞప్తి చేశారు రమేష్ రెడ్డి. బుజ్జగింపులకు వెనక్కు తగ్గలేదు రమేష్ రెడ్డి. అయితే మల్లురవి రేవంత్ రెడ్డితో మాట్లాడారు. పటేల్ రమేష్ రెడ్డికి ఎంపీ హామీ ఇవ్వడంతో నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు పటేల్ రమేష్ రెడ్డి.

కాంగ్రెస్ కీలక నేతల హామీ అభ్యర్ధి విజయం కోసం తాను నామినేషన్ ఉపసంహరించుకున్నానని పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు. ఇటు ఇబ్రహీంపట్రంలోనూ దండెం రాంరెడ్డి నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. కాంగ్రెస్ ఇన్ ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే రాంరెడ్డితో చర్చలు జరిపారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా మల్ రెడ్డి రంగారెడ్డి బరిలో ఉన్న సంగతి తెలిసిందే.

Latest articles

More like this