HomeNewsAndhra Pradeshచంద్రబాబు అరెస్ట్ పై మల్లారెడ్డి స్పందన

చంద్రబాబు అరెస్ట్ పై మల్లారెడ్డి స్పందన

Published on

ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్ట్ పై వివిధ పక్షాల నేతలు స్పందిస్తున్నారు. బీజేపీ నేతలు సైతం చంద్రబాబు అరెస్ట్ ని ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. కేంద్రానికి తెలియకుండా ఒక మాజీ సీఎంని ఎలా అరెస్ట్ చేస్తారన్నారు. సీఎం జగన్ రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారన్నారు. బాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తముందని ఆరోపించారు. ఇది వైసీపీ, బీజేపీ కలిసి చేసిన కుట్ర అని వ్యాఖ్యలు చేశారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. స్కిల్ డెవలప్మెంట్‌లో చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదన్నారు. బాబు కోసం ఐటి ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు తన మద్దతు తెలియజేశారు. చంద్రబాబు అరెస్ట్, అన్యాయం హేయమైన చర్య అన్నారు మంత్రి మల్లారెడ్డి. 2014లో మల్లారెడ్డి టీడీపీ తరఫున మల్కాజ్ గిరిలో పోటీచేసి గెలిచిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి చంద్రబాబుని సమర్ధించడం, అరెస్ట్ ని ఖండించడం చర్చనీయాంశంగా మారింది.

Latest articles

More like this