HomeNewsతెలంగాణ సర్కార్ షాక్..12 లక్షల గృహలక్ష్మి దరఖాస్తులు రద్దు

తెలంగాణ సర్కార్ షాక్..12 లక్షల గృహలక్ష్మి దరఖాస్తులు రద్దు

Published on

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సర్కారు తాజాగా షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. గృహలక్ష్మి పథకం కింద బీఆర్ఎస్ ప్రభుత్వంలో సేకరించిన 15లక్షలకు పైగా అప్లికేషన్స్‌ను పరిగణించకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించనుందని సమాచారం. వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలని ఆలోచన చేస్తుందట. కాగా ఆ పథకానికి వచ్చిన మొత్తం పిటిషన్లలో 12 లక్షల దరఖాస్తులను అర్హులైనవారిగా అధికారులు గుర్తించారని, అయితే వాటిని తప్పించి ఒకప్పటి ఇందిరమ్మ ఇళ్ల పిటిషన్ల తరహాలో గ్రామ సభలో కొత్త దరఖాస్తులు స్వీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.కాగా నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. పార్టీ హైకమాండ్ నేతలను కలవనున్నారు. అనంతరం అధిష్ఠాన పెద్దలతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించారు.

Latest articles

More like this