HomeNewsరేపే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. ముహూర్తంలో మార్పు

రేపే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. ముహూర్తంలో మార్పు

Published on

తెలంగాణ రెండవ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణం చేయనున్నారు. రేవంత్ ప్రమాణ స్వీకార ముహూర్తంలో మార్పులు చోటుచేసుకున్నాయి. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార ముహూర్తంలో స్వల్ప మార్పులు జరిగాయి. రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత రేపు ఉదయం 10.28 గంటలకు నిర్వహించాలని భావించారు. కాగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అక్కడికి చేరుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు సోనియాగాంధీతో రేవంత్ భేటీ అయ్యారు. ప్రమాణ స్వీకారానికి సోనియాగాంధీని ఆహ్వానించారు.

Latest articles

More like this