HomeNewsతెలంగాణ సీఎం కేసీఆర్ రాజీనామా.. రేపే కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం?

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజీనామా.. రేపే కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం?

Published on

సీఎం పదవికి రాజీనామా చేశారు కేసీఆర్.. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై కి రాజీనామా లేఖ ఇచ్చిన కేసీఆర్. ఎగ్జిట్ పోల్స్ ఊహించినట్టే- అవి అంచనా వేసినట్టే- కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది.తొలి రౌండ్ నుంచే హస్తం పార్టీ అభ్యర్థులు భారీ ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చారు. ఎక్కడే గానీ వెనుకంజ వేసినట్లు కనిపించలేదు.. కేసీఆర్ కేబినెట్‌లోని ఆరుమంది మంత్రులు మట్టికరిచారు. ఈ ఘోర పరాజయాన్ని బీఆర్ఎస్ అంగీకరించింది. తాము ఓటమిని స్వీకరిస్తున్నామని పేర్కొంది. రెండుసార్లు తమకు అధికారాన్ని అందించిన తెలంగాణ సమాజం పట్ల, ప్ర‌జ‌ల‌ పట్ల కృత‌జ్ఞ‌త‌తో ఉంటామని, ఈ ఫ‌లితాలను ఒక పాఠంగా భావిస్తామని, మళ్లీ పుంజుకొంటామని వివరణ ఇచ్చింది.ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు. వెంటనే అపాయింట్ మెంట్ లభించడంతో రాజీనామా లేఖను గవర్నర్ కి అందచేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సోమవారమే తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. కాంగ్రెస్ 64 సీట్లలో విజయం సాధించింది.

మరో వైపు ఓటమి అనంతరం హరీష్ రావు ట్వీట్.. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ కు అవకాశమిచ్చిన ప్రజలు ఈ సారి కాంగ్రెస్ పార్టీ ని ఆదరించారు. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పాలన సాగాలని కోరుకుంటున్నా. ఈ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా రేయింబవళ్లు శ్రమించిన మా పార్టీ శ్రేణులకు, ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు.

Latest articles

More like this