HomeNewsగద్దర్ కు ఘన నివాళి.. అంత్యక్రియల్లో కేసీఆర్

గద్దర్ కు ఘన నివాళి.. అంత్యక్రియల్లో కేసీఆర్

Published on

ప్రముఖ కవి, ప్రజా యుద్ధ నౌకగా పేరున్న గద్దర్ కి కన్నీటి వీడ్కోలు పలికారు జనం. ఆయన భౌతికకాయం అల్వాల్‌లోని భూదేవినగర్‌లో సొంత నివాసానికి చేరుకున్నాక.. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్గద్దర్‌కు నివాళులర్పించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా నివాళులర్పించారు. అనంతరం మహాబోధి స్కూల్ గ్రౌండ్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ కూడా పాల్గొన్నారు.

అంతకముందు 6 గంటల పాటు భాగ్యనగరంలో 17 కిలోమీటర్లు అంతిమయాత్ర సాగింది. ఈ యాత్రలో పెద్ద ఎత్తున కళాకారులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాసంఘాల నేతలు, కళాకారులు గద్దర్‌కు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న తమకున్న అనుబంధాలను గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. గద్దర్ లేని లోటు ప్రజా ఉద్యమాలకు తీరనిదని పేర్కొన్నారు.

Latest articles

More like this