ఈమధ్యకాలంలో స్నాక్ ఐటెమ్స్ లో సమోసా ప్రధాన పాత్ర పోషిస్తోంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళదాకా అందరూ సమోసాకి దాసోహం అంటున్నారు. సమోసా వ్యాపారం దినదిన ప్రవర్థమానంగా మారుతోంది. ఎక్కడికెళ్ళినా టీ షాపుల్లో సమోసా కనిపిస్తుంది. ఒక సమోసా తిని టీ తాగితే ఆ ఆనందమే వేరు. సమోసా అనేది అందరికీ ఇష్టం. ఫంక్షన్స్ అయినా సమోసా మస్ట్ అయిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైంది సమోసా. మనమెంతో ఇష్టంగా తినే సమోసాకి కూడా ఒక రోజుందని మీకు తెలుసా? సెప్టెంబర్ 5వ తేదీ టీచర్స్ డే మాత్రమే కాదు.. ప్రపంచ సమోసా దినోత్సవం కూడా. అందుకే జనమంతా ఇవాళ సమోసాలు తెగ తింటూ హ్యాపీ సమోసా డే అంటున్నారు.
ప్రపంచ సమోసా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ స్నాక్స్ ను పిండి, నీటితో తయారు చేస్తారు. వీటిలో బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, బఠానీలు, ఇతర సుగంధ ద్రవ్యాల పూర్ణంతో నింపుతారు. ఆ తర్వాత వాటిని బంగారు గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించి తయారు చేస్తారు.కొందరు బంగాళాదుంపకు బదులు స్వీట్ కార్న్ వాడతారు. సమోసాలు మనదేశానివి కావంటారు. అయితేనేం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మనదేశంలో సమోసా ఎవర్ గ్రీన్ స్నాక్ ఐటెం. 10వ శతాబ్దం నాటిది అయి ఉండొచ్చని చెబుతారు. 13వ లేదా 14వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన కొందరు వ్యాపారులు దీన్ని పరిచయం చేశారు. ఇది స్థానికుల హృదయాలను ఎంతో ఆకట్టుకుంది. సమోసాలు చాలా దేశాల్లో ప్రసిద్ధ స్నాక్ ఫుడ్ గా పేరు గడించాయంటే వాటికి ఎంత ప్రాచుర్యం లభించిందో అర్థం చేసుకోవచ్చు. మంచి స్ట్రీట్ ఫుడ్ గానూ ఇది విశేషంగా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా భారతదేశంలో వీటిని ప్రధాన కోర్సుగా కూడా తినవచ్చు. సమోసాలు అమ్ముతూ లక్షలాదిమంది ఉపాధిని కూడా పొందుతున్నారు.
సమోసాలలో చికెన్ సమోసా, బంగాళాదుంప సమోసా, ఉల్లి సమోసా, దాల్ సమోసా, పాలక్ సమోసా, స్వీట్ కార్న్ సమోసా అని అనేక రకాలున్నాయి. చికెన్, ఉల్లిపాయలు, బఠానీలు, మసాలాలతో చికెన్ సమోసాను తయారు చేస్తారు. ఈ ఫిల్లింగ్ ను పిండి, నీరు కలిపి తయారు చేసి పెట్టుకున్న చపాతీలో చుట్టి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించాలి. ఇలా చేస్తే నోరూరించే చికెన్ సమోసా రెడీ. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, బఠానీలు, మసాలాలతో తయారు చేయబడిన మరొక ప్రసిద్ధ సమోసా ఆలూ సమోసా. దీన్ని కూడా సమోసా గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించాలి.మార్కెట్లో ఈ సమోసా ఎక్కువగా దొరుకుతుంది. ఇక క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ వంటి వివిధ రకాల కూరగాయలతో తయారు చేయబడిన శాకాహార సమోసా వంటకం వెజిటబుల్ సమోసా. పిండిలో నింపి, ఆ తర్వాత సన్నని మంటపై బంగారు గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించాలి. ఇక దాల్ సమోసా విషయానికి వస్తే కాయధాన్యాలు, ఉల్లిపాయలు, మసాలా దినుసులతో తయారు చేయబడిన పప్పు సమోసా వంటకం. ఇది బాగుంటుంది. పాలకూర, ఉల్లిపాయలు, ఇతర మసాలాలతో తయారయ్యేది పాలక్ సమోసా. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చపాతీలా చేసుకుని.. ఆ తర్వాత ఈ ఫిల్లింగ్ ను చుట్టి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించాలి. పాలక్ సమోసా మంచి పోషకాహారంగా కూడా ఉపయోగిస్తారు. ఇన్ని సమోసాలున్నాయి కదా. మీకు ఏ సమోసా అంటే ఇష్టం.