HomeNewsసీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ వీఎం కృష్ణారావు ఆకస్మిక మృతి

సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ వీఎం కృష్ణారావు ఆకస్మిక మృతి

Published on

ప్రముఖ పాత్రికేయులు సీహెచ్ వీఎం కృష్ణారావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 64 ఏళ్ళు. ఆయన లేని లోటు తీర్చలేనిది అంటూ పలువురు సంతాపం తెలిపారు. గత ఏడాదిగా క్యాన్సర్ తో బాధపడుతూ.. చికిత్స పొందుతూ మృతి చెందారు సీహెచ్ వీఎం కృష్ణారావు.. సీనియర్ పాత్రికేయుడిగా, విశ్లేషకుడిగా గుర్తింపు పొందిన సీహెచ్ వీఎం కృష్ణారావు జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. సన్నిహితులు ప్రేమగా ‘బాబాయ్’ అని పిలుచుకునే ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ సంపాదకులు సీహెచ్విఎం కృష్ణారావు గారి మృతి బాధాకరం. కృష్ణారావు 47 ఏళ్లుగా పత్రిక రంగంలో వివిధ హోదాల్లో పనిచేసి, జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ తెలంగాణ వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సంతాపం తెలిపారు.

కృష్ణారావు ప్రయాణం 1975లో ఒక స్టింగర్‌గా ప్రారంభమైంది. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ మరియు ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో సహా అనేక పత్రికల్లో వివిధ హోదాలలో పనిచేశారు. ఆంగ్ల మరియు తెలుగు దినపత్రికలపై చెరగని ముద్ర వేశారు. డెక్కన్ క్రానికల్ కోసం న్యూస్ బ్యూరో చీఫ్‌గా సుదీర్ఘమైన మరియు అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషించారు. 18ఏళ్ళ పాటు డెక్కన్ క్రానికల్ లో ఆయన పనిచేశారు. అందరిచేత “బాబాయ్” అని ముద్దుగా పిలుచుకునే కృష్ణారావు యొక్క నిశితమైన అంతర్దృష్టి పాత్రికేయ సంఘం అంతటా ఆయనకు గౌరవాన్ని తెచ్చిపెట్టింది.గత ఏడాది క్యాన్సర్‌ బారిన పడ్డారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె, ఇద్దరు మనుమలు ఉన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్‌ఎంవీ కృష్ణారావు మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల కోణంలో వారు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా వుండేవని సీఎం గుర్తుచేశారు. నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటని పేర్కన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.

పాత్రికేయ విలువలకు పట్టంగడుతూ రాతలు, విశ్లేషణల్లో ప్రజాసంక్షేమానికే ప్రాధాన్యతనిచ్చిన సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ విశ్లేషకుడు సీహెచ్ఎంవీ కృష్ణారావు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అనారోగ్యంతో మరణించడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గత నాలుగు దశాబ్దాలుగా పాత్రికేయ రంగానికి ఆయన చేసిన సేవలు మారువలేనివని, ఆయన మరణం తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఇటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీహెచ్ వీఎం కృష్ణారావు మరణ వార్త విని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కృష్ణారావు అకాల మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌ అన్నారు. జర్నలిజంలో సరికొత్త విలువలను ఆద్యుడిగా ఆయ‌న నిలిచార‌న‌డంలో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నాయి. బాబాయిగా అందరికీ సుపరిచితులైన కృష్ణారావు గత నాలుగు దశాబ్దాలుగా పలు మీడియా సంస్థల్లో పనిచేస్తూ ప్ర‌జ‌ల‌కు సేవ చేశారని పేర్కొన్నారు. సమకాలీన రాజకీయ విశ్లేషణల్లో తనదైన ముద్ర వేసిన కృష్ణారావు గారు నిక్కచ్చిగా తన అభిప్రాయాలను చెబుతారనే పేరుగాంచారని గుర్తుచేశారు. ఏ మీడియా సంస్థలో పనిచేసినా తనదైన ముద్ర వేసిన కృష్ణారావు గారి మరణం పత్రికా రంగానికి తీరని లోటుగా భావిస్తున్నాని విచారం వ్యక్తం చేశారు.సిహెచ్‌ఎంవీ కృష్ణారావు మ‌ర‌ణం ప‌ట్ల మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయ‌న మ‌ర‌ణ వార్త త‌న‌ను క‌లిచి వేసింద‌ని పేర్కొన్నారు. సుధీర్ఘ కాలంగా కృష్ణారావుతో ఉన్న అనుబంధాన్ని ఈ సంద‌ర్భంగా మంత్రి గుర్తుచేసుకున్నారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం తెలియజేశారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణ రావు గారు పాత్రికేయ వృత్తిలో ఉండి సమాజానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు.ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు. సీహెచ్ వీఎం కృష్ణారావు లేని లోటు తీర్చలేనిదని పలువురు జర్నలిస్టులు సంతాపం తెలిపారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులు.

సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు పార్థివదేహానికి నివాళులర్పించారు మాజీ ఎంపీ కెవిపి రామచంద్ర రావు, అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవులపల్లి అమర్, సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస్ రెడ్డి, కొమ్మినేని శ్రీనివాసరావు, రాష్ట్ర మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు..రేపు ఉదయం జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Latest articles

More like this