HomeNewsబర్రెలక్క సంచలన నిర్ణయం

బర్రెలక్క సంచలన నిర్ణయం

Published on

సోషల్‌ మీడియాలో బర్రెలు కాస్తున్న ఫ్రెండ్స్‌ అంటూ ట్రెండ్‌ అయిన శిరీష ఈసారి ఎన్నికల్లో నిలబడిన విషయం విదితమే. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని.. దాని కారణంగానే తాను బర్రెలను కొనుక్కొని వాటిని కాయడానికి వెళ్తున్నానని ఓ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది శీరీష.శిరీష అంటే ఎవరో తెలియకపోయినా.. బర్రెలక్కగా మాత్రం బాగా పాపులర్ అయ్యారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయగా.. వాటిలో ఏదో ఒక ఉద్యోగం సాధించాలనే కసితో హైదరాబద్ వచ్చి.. కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యారు శిరీష. కానీ.. పేపర్స్ లీక్ అవ్వడం.. కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలను వాయిదా వేయండా.. గ్రూప్ 1 అయితే రెండు సార్లు నిర్వహించిన నేపథ్యంలో శిరీషతో పాటు.. ఎంతో మంది నిరుద్యోగులు కలత చెందారు.. నిరుద్యోగుల పక్షాన నిలబడి అసెంబ్లీలోనే తన గలం వినిపిద్దామని.. మొదటి సారిగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఒక మహిళగా పోటీలో నిలబడ్డారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా తన మార్క్ ను చూపించింది. విజిల్‌ గుర్తుతో తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషకు మొత్తం 5598 ఓట్లు వచ్చాయి.

బర్రెలక్క తమకు పోటీ కాదు.. కేవలం ఆమెకుసోషల్ మీడియాలోనే ఫాలోవర్స్ ఉన్నారు.. రియాల్టీలో లేరు అని కొల్లాపూర్ లోని ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలిచిన జూపల్లి , హర్షవర్దన్ రెడ్డి ఎన్నో సార్లు అన్నారు. కానీ.. అమెకు ప్రభుత్వ వ్యతిరేఖ ఓట్లతో పాటు.. నిరుద్యోగుల ఓట్లు కూడా బాగానే పడ్డాయి. దీంతో ఈమె రాబోయే ఎన్నికల్లో నిలిచే యువతకు ఎంతో స్పూర్తిదాయకంగా నిలిచిందనే చెప్పాలి.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క అలియాస్ శిరీష ఓటమి చెందిన విషయం తెలిసిందే. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఏకంగా 5754 ఓట్లు సాధించి సత్తా చాటింది. అయితే, తాజాగా.. తన ఓటమిపై బర్రెలక్క స్పందించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని స్వయంగా బర్రెలక్కే మీడియాతో వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క రూపాయి ఆశించకుండా, మద్యానికి లొంగకుండా తనను నమ్మి ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి, స్వతంత్రంగా దాదాపు ఆరు వేల ఓట్లు సాధించిన తాను నైతికంగా గెలిచినట్లే అని వెల్లడించారు.

Latest articles

More like this