HomeNewsతెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం

Published on

తెలంగాణలో ప్రజాప్రభుత్వం కొలువు దీరింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి దైవసాక్షిగా రేవంత్ ప్రమాణస్వీకారం చేశారు. రేవంత్ రెడ్డిని వెంటబెట్టుకొని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎల్బీ స్టేడియానికి బయలుదేరారు. ఒకే వాహనంలో ఏడుగురు అగ్రనేతలు చేరుకున్నారు.సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకారం అనంతరం భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులకు శాఖలు ఖరారు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి -హోంశాఖ, దామోదర రాజనర్సింహకు- వైద్య ఆరోగ్య శాఖ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు – రెవెన్యూ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి-మున్సిపల్, తుమ్మల నాగేశ్వర్ రావుకి-రోడ్డు, భవనాల శాఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి -ఇరిగేషన్, దుద్దిళ్ళ శ్రీధర్‌బాబుకి -ఆర్ధిక శాఖ కేటాయించారు. సీతక్కకు-గిరిజన సంక్షేమ శాఖ, జూపల్లి-సివిల్ సప్లై. పొన్నం ప్రభాకర్ కి -బీసీ సంక్షేమశాఖ, కొండా సురేఖ- స్త్రీ, శిశు సంక్షేమ శాఖలు కేటాయించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేశారు. రెండవ సంతకం దివ్యాంగురాలు రజనీ ఉద్యోగ నియామకం పత్రంపై చేశారు.దివ్యాంగురాలు రజినీకి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగ నియామక పత్రంపై రెండో సంతకం పెట్టారు.పీజీ పూర్తై 11 సంవత్సరాల తర్వాత రజనీకి ఉద్యోగం లభించింది. ఉద్యోగం రావడంపై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కొత్త ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి.. ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా శివధర్‌రెడ్డిని నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

జై సోనియమ్మ.. జైజై సోనియమ్మ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ‘మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. ఈ రాష్ట్రం త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రం. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఆకాంక్షలను ఎన్నో ఆలోచనలను ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి రాష్ట్రంలోని 4 కోట్ల మంది జనాలకు స్వేచ్ఛ ఇవ్వాలని సామాజిక న్యాయం చేయాలని అసిఫాబాద్ నుంచి మొదలుపెడితే అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి మొదలుపెడితే కొడంగల్ వరకు సమానమైన అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారి ఉక్కు సంకల్పం, కాంగ్రెస్ పార్టీ సమిధగా మారి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది’’ అని ప్రసంగించారు. రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. సీతక్క ఒకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. కొండా సురేఖ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇద్దరు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా సీనియర్ నాయకులు. ఇద్దరు కూడా ఎంపీలుగా ఉంటూ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచారు. ఎంపీలుగా రాజీనామా చేసి ఇప్పుడు మంత్రులు ఎన్నికయ్యారు. ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ విజయంలో వీరిద్దరిది కీలక పాత్ర. ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి జూపల్లి కృష్ణారావుకు మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురికి కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు మంత్రులయ్యారు. ఉమ్మడి మెదక్ నుంచి దామోదర  రాజ నర్సింహ, ఉమ్మడి కరీంనగర్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్‌లు మంత్రులయ్యారు.

మంత్రులకు శాఖలు ఖరారు

ఉత్తమ్-హోంశాఖ

దామోదర రాజనర్సింహ- వైద్య ఆరోగ్య శాఖ

భట్టి విక్రమార్క- రెవెన్యూ

కోమటిరెడ్డి-మున్సిపల్

తుమ్మల-రోడ్డు, భవనాల శాఖ

పొంగులేటి-ఇరిగేషన్

శ్రీధర్‌బాబు-ఆర్ధిక శాఖ

సీతక్క-గిరిజన సంక్షేమ శాఖ

జూపల్లి-సివిల్ సప్లై

పొన్నం-బీసీ సంక్షేమశాఖ

కొండా సురేఖ- స్త్రీ, శిశు సంక్షేమ శాఖ


Latest articles

More like this