HomeNewsAndhra Pradeshచంద్రబాబుతో పీకే భేటీ?

చంద్రబాబుతో పీకే భేటీ?

Published on

ఏపీలో రాబోయే ఎన్నికల్లో ఏం జరగబోతోంది? జగన్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్లానేంటి? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. ఇప్పటికే చంద్రబాబు నివాసంలో రాబిన్ శర్మ టీమ్ ఉంది. చర్చల్లో ఏమీ జరుగుతుందోనని సర్వత్రా ఆసక్తిగా పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు.

ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెళ్లారు. పీకే , లోకేష్ కలిసి హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి దిగడంతో ఏదో జరుగుతోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఓకే వాహనంలో నారా లోకేష్ , ప్రశాంత్ కిషోర్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళ్లారు. కాగా.. చంద్రబాబు, పీకే భేటీ సీఎం జగన్‌ కి బిగ్ షాక్ అంటున్నారు. చంద్రబాబు, పీకే కలిస్తే రానున్న ఎన్నికల్లో సీఎం జగన్‌రెడ్డి, వైసీపీ పార్టీకి ఇబ్బంది అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా వైసీపీ పార్టీకి ప్రశాంత్ కిషోర్‌ మద్దతుగా ఉన్నారు. మరి ఇప్పుడు పీకే వ్యూహం మార్చారా అనే చర్చ సాగుతోంది.

Latest articles

More like this