HomeNewsకేఏ పాల్ ని గెలిపిస్తే...సికింద్రాబాద్ స్వర్గం చేస్తారట

కేఏ పాల్ ని గెలిపిస్తే…సికింద్రాబాద్ స్వర్గం చేస్తారట

Published on

తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఊపుమీద ఉంది. అధికార బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారం తనదే అంటోంది. ఒక పక్క అధికార బి ఆర్ ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపిలు హోరా హోరీగా ఎన్నికలలో తలపడుతుంటే, మరొక పక్క బిఎస్పి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తో పాటు, కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ కూడా తెలంగాణ ఎన్నికల సమరంలో నేనున్నానంటూ ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కేఏ పాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సింది లేదు. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడిగా కేఏ పాల్ ఎన్నికల టైంలో హడావిడి చేస్తుంటారు. ఆయన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉంటారు. వివిధ అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో పోటీచేసి వందల సంఖ్యలో ఓట్లు కూడా తెచ్చుకుంటారు.

2008లో ప్రజాశాంతి పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించారు కేఏ పాల్. 2009లో ఎక్కడా పోటీ చెయ్యలేదు.2014 లోనూ పోటీ చెయ్యలేదు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 70 స్థానాల్లో పోటీ చేసినా అన్నిచోట్ల కేఏ పాల్ తో సహా అందరు అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. కానీ ఆయన మాత్రం పోటీలో నిలిచి గెలిచేది తానే అంటారు.2022లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కేఏ పాల్ పోటీచేశారు. మునుగోడులో 50 వేల మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేసిన కేఏ పాల్.. ఫలితాల్లో మాత్రం ప్రభావం చూపలేక పోయారు. కేఏ పాల్ ఉంగరం గుర్తుకు కేవలం 805 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈవీఎంల పనితీరుపై తనకు నమ్మకం లేదన్న ఆయన ఇదంతా బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల కుట్రగా భావిస్తున్నానని అని విమర్శించారు. మునుగోడులో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందన్నారు. లక్ష ఓట్లు పడ్డాయి అది అందరికీ తెలుసు అది మీక్కూడా తెలుసు అన్నారు. దీనిపై అప్పట్లో కే.ఏ.పాల్‌ పై సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారు.

Latest articles

More like this