HomeNewsNationalమహిళా రిజర్వేషన్ బిల్లు … మహిళలకు వచ్చే సీట్లు ఇవేనా?

మహిళా రిజర్వేషన్ బిల్లు … మహిళలకు వచ్చే సీట్లు ఇవేనా?

Published on

ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న తరుణం ఇప్పుడు వచ్చేసింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మహిళా రిజర్వేషన్‌ బిల్లు మంగళవారం లోక్‌సభ ముందుకొచ్చింది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ నేడు దిగువ సభలో ప్రవేశపెట్టారు. సెప్టెంబరు 20 నుంచి లోక్‌సభలో దీనిపై చర్చ జరగనుంది. ఆ తర్వాత ఓటింగ్‌ నిర్వహించి బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. ఇక, రాజ్యసభలో ఈ బిల్లును సెప్టెంబరు 21వ తేదీన ప్రవేశపెట్టనున్నారు.

అయితే, తాజా బిల్లు 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు కాదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం కొత్తగా మరో రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొస్తున్నట్లు తెలిపాయి. అందువల్ల తాజా బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. ఈ బిల్లు చట్టంగా మారితే., లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో 39-40 స్థానాలు నారీమణులకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అత్యధిక మహిళా జనాభా ఆధారంగా నియోజకవర్గాల కేటాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే నిర్మల్, ముథోల్, పెద్దపల్లి, మంథని, కరీంనగర్, హుజురాబాద్, సిరిసిల్ల, నిజామాబాద్ అర్బన్, రూరల్ స్థానాలు,జహీరాబాద్, కామారెడ్డి, పటాన్ చెరు, గజ్వేల్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, జూబ్లిహిల్స్, నాంపల్లి, కార్వాన్,యాకుత్ పురా,శేరిలింగంపల్లి, చేవెళ్ల, మహబూబ్ నగర్, మక్తల్, వనపర్తి, గద్వాల్, హుజూర్ నగర్, దేవరకొండ, తుంగతుర్తి, మునుగోడు, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, ములుగు, పినపాక, ఇల్లందు, మహబూబాబాద్, సత్తుపల్లి, కొత్తగూడెంతో పాటు మరికొన్ని స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే.. లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి.చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు బిల్లు ఇప్పటిది కాదు. ఈ బిల్లును 1996లో హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్‌పేయీ, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు సభ ఆమోదానికి నోచుకోలేదు. చివరకు ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగులోనే ఉండిపోయింది. 2014లో లోక్‌సభ రద్దు కావడంతో అక్కడ బిల్లు మురిగిపోయింది. ఈ నేపథ్యంలో మోదీ సారథ్యంలోని కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. 2027లో జనాభా లెక్కలు మరియు డీలిమిటేషన్ ప్రక్రియలు పూర్తయ్యే అవకాశం ఉన్నందున బిల్లును అత్యంత ముందుగా అమలు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రిజర్వేషన్లు ఇప్పటికే అమలులో ఉన్న పంచాయతీ ఎన్నికలలో చేసినట్లుగా, నిర్దిష్ట వ్యవధి తర్వాత మహిళలకు రిజర్వ్‌డ్ సీట్లను కేటాయించడానికి ఈ నిబంధన వీలుకల్పిస్తుందని భావిస్తున్నారు. మహిళలకు 33% సీట్లను రిజర్వ్ చేయాలని కోరుతూ 1996లో దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా ఒక బిల్లును ప్రవేశపెట్టింది. UPA ప్రభుత్వం 2008లో అధికారికంగా రాజ్యాంగంలో 108వ సవరణ బిల్లుని తిరిగి ప్రవేశపెట్టింది.

నిర్మల్-అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ముథోల్- గడ్డిగారి విట్టల్ రెడ్డి

పెద్దపల్లి -దాసరి మనోహర్ రెడ్డి

మంథని – దుదిళ్ళ శ్రీధర్ బాబు

కరీంనగర్ – గంగుల కమలాకర్

హుజురాబాద్ -ఈటల రాజేందర్

సిరిసిల్ల -కేటీఆర్

నిజామాబాద్ అర్బన్- బిగాల గణేష్ గుప్తా

నిజామాబాద్ రూరల్- బాజిరెడ్డి గోవర్ధన్

జహీరాబాద్- కె.మాణిక్ రావు

కామారెడ్డి -గంప గోవర్థన్

పటాన్ చెరు – గూడెం మహిపాల్ రెడ్డి

గజ్వేల్ -కేసీఆర్

కుత్బుల్లాపూర్ -వివేకానంద్ గౌడ్

మేడ్చల్ -మల్లారెడ్డి

జూబ్లిహిల్స్ -మాగంటి గోపీనాథ్

నాంపల్లి -జాఫర్‌ హుస్సేన్‌(MIM)

కార్వాన్ -కౌసర్ మొహియుద్దీన్ (MIM)

యాకత్ పురా -సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (MIM)

శేరిలింగంపల్లి- అరికెపూడి గాంధీ

చేవెళ్ల -కాలె యాదయ్య

మహబూబ్ నగర్- శ్రీనివాస్ గౌడ్

మక్తల్ -చిట్టెం రామ్మోహన్ రెడ్డి

వనపర్తి – సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

గద్వాల్ -బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి (డీకె అరుణ)

హుజూర్ నగర్ -శానంపూడి సైదిరెడ్డి (ఉత్తమ్ పద్మావతి రెడ్డి)

దేవరకొండ – రమావత్ రవీంద్రకుమార్

తుంగతుర్తి -గాదరి కిషోర్

మునుగోడు -కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

వర్ధన్నపేట – ఆరూరి రమేష్

స్టేషన్ ఘన్పూర్- కడియం శ్రీహరి (రాజయ్య)

ములుగు – దాన్సరి అనసూయ, సీతక్క

పినపాక -రేగా కాంతారావు

ఇల్లందు -హరిప్రియానాయక్

మహబూబాబాద్ – బానోతు శంకర్ నాయక్

సత్తుపల్లి -సండ్ర వెంకట వీరయ్య

కొత్తగూడెం -వనమా వెంకటేశ్వరరావు

Latest articles

More like this