HomeNewsఘనంగా క్రీడా దినోత్సవం

ఘనంగా క్రీడా దినోత్సవం

Published on

క్రీడలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. రుద్రారంలోని గీతమ్ యూనివర్శిటీలో జాతీయ క్రీడా దినోత్సవం 2023 ఘనంగా జరిగింది. డెరైక్టర్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో మంగళవారం జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. భారతీయ ఫీల్డ్ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ ఒక స్ఫూర్తిదాయక చిత్రాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ క్రీడలు, ఆట పోటీలను నిర్వహించి, విజేతలకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. బీఏ సెక్షాలజీ విద్యార్థిని రియా సాహుకు 2023 ఏడాదికి గాను అత్యుత్తను క్రీడా ప్రదర్శన అవార్డును ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా గీతం కళాకృతి విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను అలరించాయి.

జాతీయ క్రీడా దినోత్సవం గురించి.. మేజర్ ధ్యాన్ చంద్ శాశ్వతమైన వారసత్వానికి ఘన నివాళిగా మనదేశంలో ప్రతియేటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మనదేశంలో బలమైన క్రీడా సంస్కృతి అభివృద్ధికి ఇది ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. కేవలం పోటీ కోసమే కాకుండా సంపూర్ణ వ్యక్తిగత ఎదుగుదల కోసం వివిధ క్రీడలు, ఆటలలో చురుకుగా పాల్గొనేలా యువతను ప్రోత్సహిస్తుంది. క్రమశిక్షణ, పట్టుదల, క్రీడా స్పూర్తి, బృంద కృషి వంటి వాటిపై అవగాహనను పెంపొందించడమే కాక, వారి దినచర్యలో భాగంగా మార్చే లక్ష్యంతో దీనిని నిర్వహిస్తారు. అథ్లెట్ల సహకారం, సంకల్పం, వారి అసాధారణ విజయాలు, సమాజంపై దాని ప్రభావాన్ని గుర్తుచేసుకోవడానికి జాతీయ క్రీడా దినోత్సవం తోడ్పడుతుందన్నారు.

Latest articles

More like this