HomeNewsInternationalఉలిక్కిపడ్డ మొరాకో.. భూకంపంతో 800 పైగా దుర్మరణం

ఉలిక్కిపడ్డ మొరాకో.. భూకంపంతో 800 పైగా దుర్మరణం

Published on

మొరాకోలో ఘోర భూకంపం సంభవించింది. దీంతో దేశం ఉలిక్కిపడింది. భూకంప లేఖినిపై 6.8గా తీవ్రత నమోదు కావడంతో వందలాదిమంది దుర్మరణం పాలయ్యారు. దాదాపు 820 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మందికి గాయాలు అయ్యాయి. మరకేష్‌కు దక్షిణ దిశలో దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. మొరాకోలోని మర్రాకేశ్‌కు నైరుతి దిశగా 71 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. 6.8 తీవ్రతతో ఈ భూకంపం సంభవించడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ మేరకు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది ఆ తర్వాత కొద్ది సేపటికి 4.9 తీవ్రతతో 19 నిమిషాలపాటు పలు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూ అంతర్భాగంలో 18.5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. అల్‌ హౌజ్‌, మర్రాకేశ్‌, క్వార్జాజేట్‌, అజిలాల్‌ సహా పలు ప్రాంతాలు ఈ భూకంప ధాటికి వణికిపోయాయి.

దాంతో పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. ‘అకస్మాత్తుగా భూమి కంపించడంతో భవనాలు కదిలిపోయాయి. దాంతో ప్రజలు కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీశారు. శతాబ్దకాలంలో ఉత్తరాఫ్రికా ఈ స్థాయి భూకంపాన్ని ఇప్పటి వరకూ చవిచూడలేదని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. మరోవైపు భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.గాయపడిన వారితో సమీప ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. ఈ భూకంపం ధాటికి ప్రజలు భయంతో వణికిపోయారు. అర్ధరాత్రి కావడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇళ్లలో నుంచి రోడ్లపైకి పరుగులు పెట్టారు.

Latest articles

More like this