HomeNewsAndhra Pradeshఏపీలోనూ ముందస్తు ముచ్చట…

ఏపీలోనూ ముందస్తు ముచ్చట…

Published on

ముందస్తు ఎన్నికల వేడి ఏపీకి తాకిందా? జగన్ అందుకు రెడీ అవుతున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీ లో కూడా ముందస్తు ఎన్నికలు రానున్నాయని అంటున్నారు. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ముందస్తు గురించి జగన్ మంత్రులకు ఒక యాక్షన్ ప్లాన్ సూచించారు. ఈ విషయంలో మంత్రులకు సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. ఏపీలో ఎన్నికలకు సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు దిశా నిర్దేశం చేసారు. కేంద్రం ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ దిశగా ఆలోచన చేస్తున్న సమయంలో అక్కడి నిర్ణయాలకు అనుగుణంగా ఏపీలో ఎన్నికలపై సంకేతాలు ఇచ్చారు.

విశాఖ నుంచి పాలన పైనా తేల్చి చెప్పారు. అదే సమయంలో అసెంబ్లీ వేదికగా చంద్రబాబు స్కాంలను బయట పెట్టాలని నిర్ణయించారు.మంత్రులు ఇక సీరియస్ గా పని చేయాలని సీఎం స్పష్టం చేసారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధికారిక అజెండా తరువాత మంత్రులతో ముఖ్యమంత్రి రాజకీయ అంశాలపైన చర్చించారు. ఈ సమయంలో ఎన్నికలకు సంబంధించి కీలక సూచనలు చేసారు.కేంద్రంలో జమిలి ఎన్నికల పైన చర్చ జరుగుతున్న వేళ ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా సిద్దంగా ఉండాలని మంత్రులకు నిర్దేశించారు. కేంద్రం ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ పేరుతో ఎన్నికలకు వెళ్తే ఏపీకి అప్పుడే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉందని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.

ఇవాళ కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకం ఏర్పాటుకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలు బిల్లును మంత్రిమండ‌లి ఆమోదించింది. ఉద్యోగి రిటైర్డ్‌ అయిన సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటి స్థలం ఉండాలి. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. రిటైర్డ్‌ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్‌ అయ్యేలా చూడాలి. వారి పిల్లల చదువులు కూడా ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కింద ఉండి ప్రయోజనాలు అందేలా చూడాలి. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. వీటితోపాటు పలు నిర్ణయాలు తీసుకుంది.

  • దేవాదాయ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం.
  • కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం.
  • ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లుకి ఆమోదం.
  • ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లుకు ఆమోదం.
  • కురుపాం ఇంజినీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
  • పోలవరం ముంపు బాధితులకు 8,424 ఇళ్ల నిర్మాణానికి గ్రీన్‌సిగ్న‌ల్‌.
  • అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు, పీఓటీ చట్ట సవరణకు మంత్రిమండ‌లి ఆమోదం.
  • భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం.

Latest articles

More like this