HomeNewsAndhra Pradeshచంద్రబాబు కేసులో తీర్పు వాయిదా

చంద్రబాబు కేసులో తీర్పు వాయిదా

Published on

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్ కేసులో వాదనలు ముగిశాయి. చంద్రబాబు క్వాష్‌ కేసులో తీర్పు వాయిదా పడింది. ఉదయం నుంచి సుదీర్ఘంగా సాగిన వాదనలు అనంతరం మధ్యాహ్నం కాస్త విరామం తీసుకున్నారు. కేసులో సుదర్ఘ వాదనలు వినిపించారు ఇరుపక్షాల న్యాయవాదులు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 వరకు వాదనలు సాగాయి. వాదనల అనంతరం తీర్పుని రిజర్వు చేసింది హైకోర్ట్. ఈ క్వాష్ పిటిషన్లో తీర్పు రెండురోజుల తర్వాత వెల్లడిస్తామని హైకోర్టు వెల్లడించింది. చంద్రబాబు తరఫున వాదించిన హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా పలు అంశాలను కోర్టుకి విన్నవించారు.

ఇటు విజయవాడ ఏసీబీ కోర్టులో మూడు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా పడింది. సీఐడీ కస్టడీ, చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా వేయాలన్నారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు. హైకోర్టులో విచారణ జరుగుతోందని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు చంద్రబాబు తరఫు లాయర్లు. విచారణ రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ఏసీబీ కోర్టు. సీఐడీ తరఫున వాదించారు ముకుల్ రోహత్గీ, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి.

మరోవైపు.. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై మరో పీటీ వారెంట్ దాఖలయింది. ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ జారీ అయింది. టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపిస్తోంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుని నిందితుడుగా పేర్కొంటూ వారెంట్ ఇచ్చారు.

Latest articles

More like this