HomeNewsర్యాగింగ్, డ్రగ్స్ కు దూరంగా ఉండాలి.. విద్యార్ధులకు జడ్జి శంకర్ శ్రీదేవి పిలుపు

ర్యాగింగ్, డ్రగ్స్ కు దూరంగా ఉండాలి.. విద్యార్ధులకు జడ్జి శంకర్ శ్రీదేవి పిలుపు

Published on

విద్యారంగంలో ర్యాగింగ్ పెడధోరణులు పడుతోందని, ఇది మంచిది కాదని, ర్యాగింగ్ కి పాల్పడి విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దని విద్యార్ధులకు వక్తలు ఉద్బోధించారు. ఇబ్రహీంపట్నంలోని గురునానక్ విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ అండ్ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి శంకర్ శ్రీదేవి హాజరయ్యారు. విద్యార్దులనుద్దేశించి ఆమె ప్రసంగించారు. వారికి యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్ పై అవగాహన కల్గించారు.తెలంగాణలో యాంటీ డ్రగ్స్, ర్యాగింగ్ చట్టాలు, శిక్షల గురించి వివరించారు. విద్యార్థులు ఎవరూ ర్యాగింగ్ కి పాల్పడకూడదు, డ్రగ్స్ కి అడిక్ట్ కాకూడదన్నారు. వివిధ చట్టాల గురించి వాటిని ట్రిబ్యునల్, డిస్ట్రిక్ట్, హైకోర్ట్, సుప్రీంకోర్టులలో ఏవిధంగా అప్పీల్ చేయాలో జడ్జి శంకర్ శ్రీదేవి వివరించడం జరిగింది. సీనియర్ అడ్వకేట్ రవి మాట్లాడుతూ.. విద్యార్ధులు ర్యాగింగ్ కి పాల్పడితే సస్పెన్షన్, హాస్టళ్ళ నుంచి బయటకు పంపిస్తామన్నారు. అంతేకాదు అడ్మిషన్ రద్దవుతుందని, తరగతులకు హాజరుకాకుండా సస్సెండ్ చేయడం జరుగుతుందన్నారు.

జీఎన్ఐటీ ప్రిన్సిపల్ డా.ఎస్.శ్రీనాథ్ రెడ్డి యాంటీ ర్యాగింగ్ చట్టాలు, గురునానక్ ఇనిస్టిట్యూషన్స్ గైడ్ లైన్స్ గురించి వివరించారు. ర్యాగింగ్ కి పాల్పడితే ఎలాంటి సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయో వివరించారు. విద్య వ్యవస్థలో ర్యాగింగ్ పై నిషేధం ఉందని స్పష్టం చేశారు. ర్యాగింగ్ కు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎవరైనా ర్యాగింగ్ లు చేసిన ఎలాంటి ఇబ్బందులు పెట్టిన వెంటనే ఉపాధ్యాయులకు తెలపాలని సూచించారు. విద్యార్థుల మేలు కోసం ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నామన్నారు. ర్యాగింగ్ కు పాల్పడి తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు.

విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని మీ తల్లితండ్రులకు మంచి పేరు తీసుకోరావాలన్నారు. విద్యార్థినుల పట్ల గౌరవంగా ఉండాలని వక్తలు సూచించారు. డాక్టర్ పార్థసారథి జేడీ మాట్లాడుతూ.. విద్యార్ధులను ఉద్దేశించి ఏఐసీటీఈ, జేఎన్టీయూహెచ్ యాంటీ ర్యాగింగ్ గైడ్ లైన్స్ గురించి వివరించారు. కళాశాలలో ఇప్పటివరకూ ఎలాంటి ర్యాగింగ్ జరగలేదన్నారు. నూతనంగా వచ్చిన విద్యార్ధులు విద్యను అభ్యసించాలని కోరారు. డైరెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. అమూల్యమయిన జీవితాలను పాడుచేసుకోవద్దని కోరారు. దేశ భవిష్యత్ విద్యార్ధుల మీద ఆధారపడి ఉంటుందన్నారు. గౌరవ అతిధిగా విచ్చేసిన అడిషనల్ సివిల్ జడ్జి రంగారెడ్డి జిల్లా జస్టిస్ కె.నాగరాజు మాట్లాడుతూ.. దేశానికి యువతే వెన్నెముక అనీ, ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండాలన్నారు. విద్యార్ధులంతా సోదరభావంతో కలిసి మెలిసి విద్యను అభ్యసించి, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధినీ, విద్యార్ధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Latest articles

More like this