HomeNewsAndhra Pradeshఏపీలో లిక్కర్ లొల్లి… బీజేపీ వర్సెస్ వైసీపీ

ఏపీలో లిక్కర్ లొల్లి… బీజేపీ వర్సెస్ వైసీపీ

Published on

ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు అరెస్ట్ లు, ముందస్తు బెయిల్ వ్యవహారాలు హాట్ హాట్ గా ఉంటే.. మరోవైపు లిక్కర్ రాజకీయాలు హోరెత్తుతున్నాయి. అధికార వైసీపీ, విపక్ష బీజేపీ నేతల మధ్య మద్యం పై మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో మద్యంపై చేసిన విమర్శలపై మంత్రి నారాయణ స్వామి మండిపడుతున్నారు. పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఏపీలో కల్తీ మద్యం ఉందని నిరూపించాలని నారాయణ స్వామి సవాల్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వైసీపీ నేతల తీరుపై బీజేపీ నేత , మాజీ ఎమ్మెల్యే విష్టుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యం ఏపీలో లేదన్నట్లు నారాయణ స్వామి మాట్లాడటం హాస్యాస్పదం, ఆశ్చర్యకరమని.. మంత్రి నారాయణ స్వామి జగనన్న మద్యం ఎప్పుడూ తాగి ఉండరంటూ సెటైర్ విసిరారు.అందుకే ఆయనకు చీప్ లిక్కర్ కోసం తెలీయదన్నారు.ప్రజలు ప్రాణాలు పోతే చూస్తే ఊరుకునే చేతకాని దద్దమ్మలం తాము కాదన్నారు. మద్యం కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం డబ్బులు ఏ ప్యాలెస్‌కు వెళ్లుతోందని ప్రశ్నించారు. మధ్యనిషేధంపై సీఎం జగన్ మాట తప్పారు, మడమ తిప్పారన్నారు. మద్యం డబ్బులతో అప్పులు తేవడం ఘోరమని విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.మొత్తం మీద ఏపీలో లిక్కర్ రాజకీయం ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి.

Latest articles

More like this