KTR New Look :  పాలిటిక్స్‌ ఎప్పుడూ ఒకేలాగే ఉంటే బోరు కొడతాయా? అంటే అవునేనే మాట వినిపిస్తోంది. ఎప్పటికప్పుడు సిద్ధాంతాలు మారుతుంటేనే ఎక్కువ కాలం పార్టీలు సస్టెయిన్ అవుతాయి. ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా నడుచుకోవాలి.. నడపాలి. హీరోలు కూడా అంతే. అభిమానులు ఏం కోరుకుంటున్నారో.. ఏలుక్‌లో ఉంటే ఇష్టపడుతున్నారో అలా ట్రైన్ చేస్తేనే చూస్తారు.. అలా సినిమాలు తీస్తేనే ఆదరిస్తారు. ఇక నాయకులు కూడా అంతే.. ఎప్పుడు ఒకేలాగే ఉంటే కార్యకర్తలు, అభిమానులకు కూడా బోరు కొట్టేస్తాతారు. వాళ్లు ఎప్పడిప్పుడు విజువల్ అప్పియరెన్స్ అవుతుండాలి… రీబ్రాండ్ చేసుకోవాలి. అప్పుడే అభిమానులు, కార్యకర్తలు ఫోటోలు దిగడానికి పోటీపడతారు. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌, జగన్, లోకేష్‌ ఈవిషయంలో ఫుల్ సక్సెస్ అయ్యారు. గతంలో ఉన్న సాఫ్ట్ ముద్రను చెరిపేయడానికి నారా లోకేష్ తన పాదయాత్ర ముందు బాడీ లాంగ్వేజ్‌ కంప్లీంట్‌గా మార్చుకున్నారు. మాటతీరును మార్చేశారు. ఎంతసేపు మాట్లాడినా.. చూసినా బోరుకొట్టకుండా తయారయ్యారు. ఇప్పడు కేటీఆర్ కూడా తనపై ఉన్న కార్పోరేట్‌ ముద్రను తొలగించుకునేందుకు ఈప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. క్లాస్ ఇమేజ్‌ను పక్కనబెట్టి.. ఫుల్ మాస్‌ ఎంట్రీ ఇచ్చారు.

చరిత్ర ఏం చెబుతోంది?
గత చరిత్రను పరిశీలిస్తే.. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, రాహుల్ గాంధీ, లోకేష్‌ వంటి నేతలు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అప్పుడు వారు పెంచిన గడ్డం ఒక శక్తివంతమైన సింబాలిజమ్‌ వచ్చింది. మాస్ లుక్ పాదయాత్ర సమయంలో ఒక సీరియస్ పోరాట యోధుడి ఇమేజ్‌ను తీసుకొస్తుంది. చరిత్రను పరిశీలించిన కేటీఆర్ ఇటీవల కాలంలో కంప్లీట్‌గా ఛేంజ్‌ అయ్యారు. కొత్తగా మాస్ మేక్ ఓవర్ (గడ్డం లుక్‌)లో కనిపిస్తున్నారు. ఇటీవల రామగుండం జరిగిన సింగరేణి సభకు గడ్డంతో కనిపించి .. నేతలను, కార్యకర్తలను ఆశ్చర్యానికి గురి చేశారు. అందరి కళ్లు ఆయన వైపు తిప్పుకునేలా చేశారు. అయితే కేటీఆర్‌కి ఈలుక్ కొత్త. ఎప్పుడూ క్లీన్‌ సేవ్‌, ట్రెండీ కాస్టీ డ్రస్‌లో.. రిచ్‌ లుక్‌లో కనిపిస్తారు. అలాంటి కేటీఆర్ ఒక్కసారిగా మాస్ లుక్‌లోకి రావడంతో ఆయన గడ్డంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో చేపట్టబోయే పాదయాత్ర, రాజకీయ వ్యూహాల్లో భాగంగానే లుక్‌ ఛేంజ్‌ చేశారనే టాక్ జోరుగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో, కార్మిక వర్గాలకు దగ్గరయ్యేందుకు, వారు ఓన్‌ చేసుకునేందుకు ఈ మేక్ ఓవర్ ఛేంజ్‌ చేసినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో నాయకుల మాటలే కాదు.. వారి ఆహార్యం కూడా చర్చించుకుంటారు. కేటీఆర్ కొత్త లుక్‌పై అటు గులాబీ శిబిరమే కాదు.. అన్ని పార్టీల వర్గాలు.. ఆయన అభిమానులు డిస్కషన్ చేస్తున్నారు. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న కేటీఆర్ 40ఇయర్స్ లోపు ఉన్న వారిని అట్రాక్ట్ చేసేందుకు టార్గెట్‌గా పెట్టుకున్నారని తెలుస్తోంది. తన గ్రాఫ్ ను పెంచుకునే పనిలో భాగంగానే బియర్డ్ లుక్‌ లో కనిపిస్తున్నారని టాక్.

గడ్డం పెంచితే సీఎం అవుతారా? – ఎంపీ అర్వింద్‌(Dharmapuri Arvind)
కేటీఆర్ గడ్డం పెంచడంపై మరోవైపు రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడ్డం పెంచుకుంటే సీఎం అవుతారని ఎవరో చెప్పడంతోనే కేటీఆర్ లుకింగ్ మార్చేశారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు. గడ్డం పెంచడం వల్ల ఇంకా కొంచెం గడ్డం పెరుగుతుందే తప్పా.. సీఎం మాత్రం కాలేరని సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో గడ్డం పెంచుకోవడం రాష్ట్రంలో కొత్తేమీ కాదని గతంలోను ఇలాగే జరిగిందన్నారు. కాంగ్రెస్ మాజీ పీసీసీ ప్రెసిడెంట్ , ప్రజెంట్ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కూడా గతంలో గడ్డం పెంచారని గుర్తు చేశారు. అప్పుడు ఆయన గడ్డం పెరిగిందే కాని ముఖ్యమంత్రి అయ్యారా? అని ప్రశ్నించారు. ఆయన పీసీసీగా ఉన్న టైంలో ఆయన గడ్డం పెరిగిందే కాని కాంగ్రెస్ పార్టీ ఎదగలేదని వ్యగ్యంగా మాట్లాడారు.

కేటీఆర్ గడ్డంపై కాంగ్రెస్ విమర్శలు
కేటీఆర్ గడ్డం పెంచి వేషం మారుస్తున్నారని కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. గడ్డం పెంచుకుంటే సీఎం రేవంత్‌రెడ్డి మాదిరి అధికారంలోకి వస్తామని కేటీఆర్ కలలుగంటున్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆరోపించారు. అంతేకాదు కేటీఆర్ మానసిక స్థితి భాగోలేదని ఆరోపించారు.