ఖైరతాబాద్ బరిలో మూడు పార్టీల అభ్యర్థులు వీరే?
ఖైరతాబాద్ ఉప ఎన్నికలు ఎప్పుడొస్తాయనేది ఇప్పుడు కీలకం. ఓ పక్క ఎల్ నినో నేథ్యంలో ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక అభ్యర్థులు ఎవరు అనేది అన్ని పార్టీలకు తలనొప్పిగా మారింది

Khairatabad By Poll:
ఖైరతాబాద్ ఉప ఎన్నికకు అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. దానం నాగేందర్ పై సుప్రీం కోర్టు ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నిక ఖాయమైంది. సెప్టెంబర్ 26న ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ సీట్ ఖాళీ అయిందని గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ప్రస్తుత SIR చివరి అంకం అంటే ఎలెక్టోరల్ రోల్స్ పబ్లిష్ అయ్యిన తేదీ నవంబర్ 9 తర్వాత ఎప్పుడైనా ఈ నియోజక వర్గానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావచ్చు. దీంతో అన్ని పార్టీలు అభ్యర్థుల విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి.. ఇంతకీ ఈ పార్టీ నుంచి ఎవరెవరు పోటీలో ఉన్నారో చుస్తే ఆసక్తి కలుగుతుంది .
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ నుంచి గెలిచి కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ పై పోటీ చేయడంతో దానం పై అనర్హత వేటు పడింది . కానీ ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ అతనికే ఇస్తారా అన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పీజేఆర్ కుమార్తె విజయ రెడ్డి పోటీ చేసింది దానంపైనే.. ఇప్పుడు ఆమె కూడా ప్రధాన రేస్ లో ఉన్నారు.. తనకు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం దానం నాగేందర్ కి టికెట్ ఖరారైందని తెలుస్తోంది. విజయారెడ్డి కి హైదరాబాద్ మేయర్ గా హామీ ఇవ్వాలని అధిష్టానం భావిస్తోందని ప్రచారం జరుగుతోంది..
బీఆర్ఎస్ టికెట్ ఎవరికి?
బీఆర్ఎస్ టికెట్ రేస్ లో ప్రధానంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ ప్రధాన పోటీలో ఉన్నారు. ఇక గతంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మన్నె గోవర్ధన్ రెడ్డి కూడా టికెట్ అడుగుతున్నారు. ఖైరతాబాద్(Khairatabad By Poll) పక్క నియోజకవర్గం జూబ్లీహిల్స్. ఇక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తలసాని బంధువు కావడంతో కొంత వరకు కాంగ్రెస్ ని కట్టడి చేయొచ్చని బీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్. గత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సమయంలో తలసాని ఈ ఎన్నికల బీఆర్ఎస్ ఇంచార్జి గా ఉన్నా కొంత వరకు తన బంధువుకు సహకరించింది నిజం. ఇప్పుడు అదే తమకు ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది..
బీజేపీ నుంచి టికెట్ అతనికే?
బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డి ఇప్పుడు మళ్ళీ(Khairatabad By Poll) పోటీచేయపోతున్నారు. ఒకసారి టీడీపీ కూటమి అభ్యర్థిగా అయన బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.. ఇప్పుడు పీవీ నరసింహారావు మనవడు సుభాష్ పోటీలో ఉన్నా నియోజకవర్గంపై గట్టి పట్టు ఉన్న చింతల రామచంద్రారెడ్డికే సీట్ గ్యారంటీ..
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. బీఆర్ఎస్, బీజేపీ లకు ప్రధాన శత్రువు కాంగ్రెస్. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం వల్ల కాంగ్రెస్ కి లాభం చేకూరుతుంది అని అనుకుంటే ఈ పార్టీల్లో ఒక పార్టీ బలహీనమైన అభ్యర్థిని పోటీలో పెట్టి కాంగ్రెస్ ఓటమికి పనిచేయొచ్చు..



