గ్రాండ్‌గా సీజన్ 2.. భానుమతి ఎంట్రీతో ప్రారంభం!
Jayammu Nischayammura Season 2: జీ తెలుగు పాపులర్ సెలబ్రిటీ టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి రెండో సీజన్ ప్రేక్షకులను మైమరపించనుంది. అక్టోబర్ 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 18 నుంచి జీ తెలుగు టెలివిజన్‌లో ప్రసారం అవుతుందని ఇప్పటికే నిర్వహకులు ప్రకటించారు.

Jayammu Nischayammura Season 2: జీ తెలుగు పాపులర్ సెలబ్రిటీ టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి రెండో సీజన్ ప్రేక్షకులను మైమరపించనుంది. అక్టోబర్ 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 18 నుంచి జీ తెలుగు టెలివిజన్‌లో ప్రసారం అవుతుందని ఇప్పటికే నిర్వహకులు ప్రకటించారు. ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రెండో సీజన్ గ్రాండ్ లాంచ్‌కు ఈసారి స్టార్ హీరోయిన్ సాయి పల్లవి అతిథిగా హాజరుకానున్నారు. మన పక్కంటి అమ్మాయిలా. సహజమైన నటనతో, ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న భానుమతి.. ఈ షో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌లో సందడి చేయబోతున్నారు. ప్రముఖ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షో.. వెండితెరపై కనిపించే తారల వ్యక్తిగత జీవితాల్లోని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌లో జీ తెలుగు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తొలి సీజన్‌లో అక్కినేని నాగార్జున, శ్రీలీల వంటి ప్రముఖులు అతిథులుగా పాల్గొని, తమ వ్యక్తిగత జీవిత విశేషాలు, సినీ ప్రయాణం, అనుబంధాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తెలుగు ప్రేక్షకులను అలరించారు. హోస్ట్ జగపతిబాబు, సెలబ్రిటీల మధ్య జరిగే సహజమైన సంభాషణలే ఈ షోకు ప్రధాన ఆకర్షణనని చెప్పాలి. తమ జీవితాలను మలుపు తిప్పిన అనుభవాలు, ఇప్పటివరకు ఎవరికీ తెలియని విషయాలు, పెద్దగా బయటకు రాని జ్ఞాపకాలు, వారి జీవితంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు, మరచిపోలేని సంఘటనల గురించి సెలబ్రిటీలు ఈషోలో మనసు విప్పి మాట్లాడారు. ఇప్పటికే మంచి ఆదరణ పొందిన ఈ షోకు.. ఇప్పుడు రాబోయే రెండో సీజన్‌పై ఆసక్తి నెలకొంది. మనసులోని మాటలను నిక్కచ్చిగా బయటకు చెప్పే జ్ఞాపకాలు, ఆసక్తికరమైన విషయాలు, వినోదభరితమైన విశేషాలతో ఈ కొత్త సీజన్ ప్రేక్షకులను అలరించనుంది. మరిన్ని వ్యక్తిగత విశేషాలు, ఆసక్తికరమైన ముచ్చట్లతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
ప్రేమమ్‌తో తెలుగు ప్రేక్షకులకు డ్యాన్స్ క్వీన్‌గా పరిచమైన సాయిపల్లవి.. ఫిదా సినిమాతో భానుమతి ఒక్కటే పీస్ అనే డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకుల మనసులు చొరగొన్నారు. ఇప్పుడు జయమ్ము నిశ్చయమ్మురా రెండో సీజన్‌లో సాయి పల్లవి నటిస్తోన్న రామయణ సినిమా విశేషాలను ప్రజలతో పంచుకోనుందనే టాక్ ఆసక్తి రేపుతోంది. సీత పాత్రతో ప్రేక్షకుల్లో ఆమెపై అభిమానం మరింత పెరిగింది. చాలామంది ఆమెను తమ ఇంటి అమ్మాయిలా భావిస్తూ మా సీత అని ఇప్పటికే ఆప్యాయంగా పిలుచుకుంటున్నట్లు సందర్భాలు ఉన్నాయి. ఈషో ద్వారా ఆమె నటించిన సీత పాత్ర గురించి మరిన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటారని తెలుస్తోంది. దీంతో ఈ ఎపిసోడ్‌కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సినిమా టైటిల్‌ను ప్రకటించిన తర్వాత సాయి పల్లవి పాల్గొంటున్న తొలి ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా ఇదేనని తెలుస్తోంది. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో నిరాడంబరంగా ఉండే ఆమె, మనసులోని మాటలను ఉన్నది ఉన్నట్టుగా పంచుకునే విధానం సాయి పల్లవిని సమకాలీన భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేకంగా నిలబెడుతోంది.
తొలి ఎపిసోడ్‌లో సాయి పల్లవి, జగపతిబాబుతో కలిసి ఓపెన్ మైండ్‌తో, ఉన్నది ఉన్నట్లు మాట్లాడబోతున్నారని తెలుస్తోంది. తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, తన చిన్ననాటి జ్ఞాపకాలు, ఇప్పటివరకు ప్రేక్షకులకు పెద్దగా తెలియని పలు ఆసక్తికరమైన విషయాలను ఈషోలో తెలియజేస్తారని వినికిడి. జగపతిబాబు తనదైన శైలిలో సంభాషణను ముందుకు నడిపించనుండటంతో.. ఇద్దరి మధ్య జరిగే ఈ ముచ్చట్లు వ్యక్తిగత అనుభవాల కలయికగా జయమ్ము నిశ్చయమ్మురా షో సాగనుంది. రెండో సీజన్ అక్టోబర్ 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే అక్టోబర్ 18, ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు జీ తెలుగులో టెలివిజన్ ప్రసారం కానుంది. ఈ షో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.



