Jagan Slams Arrest of Appireddy Cases Illegal

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టును.. ఆయనపై మోపుతున్న కేసును వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపితే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్సీ పట్ల ప్రభుత్వం వహిస్తున్న వైఖరి దుర్మార్గమని (Jagan Slams Arrest of Appireddy Cases Illegal)మండిపడ్డారు. ఏకంగా ఒక ఎమ్మెల్సీపై డెకాయిటీ, దొంగతనం కేసులు పెట్టడం కంటే దుర్మార్గం ఏముంటుందని నిలదీశారు. అసలు ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. ఏపీలో జంగిల్ రాజ్‌ ఉందని.. ఎమర్జెన్సీని తలపించే పాలన నడుస్తోందని ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు జగన్‌.

డెకాయిట్ కేసులా..?

గురువారం పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిశాక, గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం నుంచి నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌కు వెళ్లాల్సిన బ్యాలెట్ బాక్సులను మధ్యలో నల్లపాడు వద్ద ఎందుకు దించారని జగన్ ప్రశ్నించారు. ఈ అక్రమాన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడం దారుణమన్నారు. తప్పు చేసి, బ్యాలెట్ బాక్సులు మార్చే ప్రయత్నం చేస్తూ.. తప్పు చేసిన వారిని ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు(Jagan Slams Arrest of Appireddy Cases Illegal) పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అప్రజాస్వామిక పద్ధతులను దేశమంతా చూస్తోంది. ప్రజలు మీకు తగిన బుద్ధి చెబుతారని జగన్ తన ట్వీట్‌లో హెచ్చరించారు.

అంబటి అభ్యంతరం..!

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నేతలు, అధికారులు కుమ్మక్కై ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. వెంగళాయపాలెంకు చెందిన బ్యాలెట్ బాక్స్‌ను అధికారులు మాయం చేయాలని చూశారని, దీనిని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయని అంబటి తెలిపారు. న్యాయం కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డి(Jagan Slams Arrest of Appireddy Cases Illegal)తో పాటు ఇతర నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. దోపిడీ చేస్తున్న వారికి రక్షణ కల్పిస్తూ, దానిని అడ్డుకున్న వారికి శిక్ష వేస్తారా? రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తుంటే ఏం చేయాలి? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీడీపీ నేతలు అప్పిరెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, అన్యాయాలను అడ్డుకుంటే కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.