HomeEntertainmentవరలక్ష్మీ శరత్ కుమార్ కి NIA షాక్

వరలక్ష్మీ శరత్ కుమార్ కి NIA షాక్

Published on

సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ కి ఎన్ఐఏ అధికారులు నోటీసులు జారీచేశారు. యశోద, వీరసింహారెడ్డి, మైఖేల్‌ చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన ఆమె తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటున్న వరలక్ష్మీ శరత్ కుమార్ డ్రగ్స్ కేసుకు సంబంధించి కొచ్చి ఎన్‌ఐఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. చాలాకాలంగా వరలక్ష్మి దగ్గర పీఏగా పని చేస్తున్న ఆదిలింగం అనే వ్యక్తి డ్రగ్స్‌ కేసులో కీలక నిందితులలో ఒకరిగా చెలామణి అవుతున్నట్లు కొచ్చి పోలీసులు గుర్తించారు. ఆయనకు అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లర్లతో ఆయనకు సంబంధాలు ఉన్నట్లు పక్కా ఆధారాలు పోలీసులకు లభించాయి.

దీంతో ఆదిలింగంను ఎన్‌ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆదిలింగంకు సంబంధించిన పూర్తి వివరాల కోసం నటి వరలక్ష్మిని విచారించడానికి ఎన్‌ఐఏ అధికారులు సమన్లు జారీచేశారు.వరలక్ష్మికి కూడా గతంలో అతను డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు ఎన్‌ఐఏ అధికారులు అనుమానిస్తున్న సంగతి తెలిసిందే. దీని వెనుక కోలీవుడ్‌కు చెందినవారు ఎవరెవరు ఉన్నరో అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఈడ్రగ్స్ కేసుతో కోలీవుడ్ ఉలిక్కిపడింది. ఎన్ఐఏ అధికారులు ఏం ప్రశ్నలు అడుగుతారో చూడాలి మరి.

Latest articles

More like this