అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు .. అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! ఈ సారి ప్రత్యేకత … చిన్ని ‘క్లిన్ కారా’ తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి. తన ఫ్యామిలీ మొత్తాన్ని ఫోటోలో చూపించారు. ఉపాసన కొణిదెల ఒళ్ళో క్లిన్ కారాను ఉంచారు. మొత్తం మీద ఈ వినాయకచవితి మాత్రం కొణిదెల ఫ్యామిలీలో సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.

