‘బిచ్చగాడు’ హీరో విజయ్ ఆంటోని ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు మీరా (17) ఆత్మహత్యకు పాల్పడడంతో అసలేం జరిగిందన్న వార్తలు వస్తున్నాయి. మీరా ప్రస్తుతం చెన్నైలోని చర్చి పార్క్ కాలేజ్‌లో ఇంటర్ సెకండియర్ చదువుతోంది.మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఉదయాన్నే ఇంట్లో వాళ్ళు చూసేసరికి ఆమె ఉరేసుకుని కనిపించారు.మీరాను వెంటనే కావేరి ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అప్పటికే మీరా మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. అయితే ఆమె ఆత్మహత్యకు చదువుల ఒత్తిడే కారణమని భావిస్తున్నారు.ఈ ఘటన జరిగేటప్పటికీ విజయ్ ఆంటోని ఇంట్లో లేరని చెబుతున్నారు.
హీరో విజయ్ ఆంటోని -ఫాతిమా 2006లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్ళు. పెద్ద కూతురు మీరా ఆత్మహత్యకు పాల్పడడం షాక్ కి గురిచేసింది. విజయ్ కుటుంబం చెన్నైలోని డీడీకే రోడ్డులో నివాసం ఉంటోంది. మీరా ఆత్మహత్యకు పాల్పడంతో విజయ్ ఆంటోని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మీరా మృతికి గల అసలు కారణాలు ఏంటని పోలీసులు ఆరాతీస్తున్నారు. ఇప్పటి వరకూ విజయ్ ఆంటోని అయితే తన కూతురి మృతిపై స్పందించలేదు.పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ ఆంటోని కూతురి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా ధైర్యం చెబుతున్నారు. మీరా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అతను 2005 లో సంగీత దర్శకుడిగా చిత్రరంగంలో అరంగేట్రం చేశారు విజయ్ ఆంటోని. ఉత్తమ సంగీత విభాగంలో “నాక ముక్క” అనే సినిమా ప్రకటనల పాట కోసం 2009 కేన్స్ గోల్డెన్ లయన్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడుగా పేరు తెచ్చుకున్నారు. ఈ పాట ద్వారా ఎంతో గుర్తింపు పొందాడు. 2011 క్రికెట్ ప్రపంచ కప్‌లో ప్రత్యేకంగా ప్రదర్శితమయింది. తన తొలి చిత్రం 2012 లో “నాన్” అయినప్పటికీ అతను సలీం (2014), పిచైకరన్ (2016), సైతాన్ (2017), యమన్ (2017), కొలైగరన్ (2019) వంటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలలో విలక్షణంగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. మీరా ఆత్మహత్యకు గల కారణాలు బయటకు రావాల్సి ఉంది.