ముకుంద జ్యూయలర్స్ సమర్పించు సెప్టెంబర్06, బుధవారం 2023 బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి..22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 55 వేలుగా ఉంది. 24 క్యారెట్ ల బంగారం 59 వేల 780 రూపాయలుగా వుంది..18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 45 వేల 100 రూపాయలుగా వుంది. హైదరాబాద్ లో వెండి కేజీ 76 వేల 200గా వుంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.దేశంలో ప్రధాన నగరాల్లో కిలో వెండిపై రూ. 1000 తగ్గింది. పెళ్లిళ్లు, పండుగల సీజన్ వేళ పసిడి ప్రియులకు ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు దిగిరావడమే ఇందుకు కారణం అని బులియన్ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. దీంతో బంగారం ఆభరణాల కొనుగోలుకు ఇదే మంచి తరుణమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాముల బంగారం ధర రూ. 55,150 వద్ద ఉంది.తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. మంగళవారంతో పోల్చితే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం పై రూ. 150 తగ్గింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 160 తగ్గింది. దీంతో బుధవారం ఉదయం నమోదైన ధరల వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 55,150కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,160గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే..ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,300 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,160 వద్ద కొనసాగుతోంది.బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,160గా ఉంది.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,450 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,490గా ఉంది.ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,160గా ఉంది.దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో కిలో వెండిపై రూ. 1000 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణాల్లో కిలో వెండి ధర రూ. 79,000గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీలో కిలో వెండి రూ. 75,200 కాగా, చెన్నైలో 79,000 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి రూ. 75,500 కాగా, ముంబయిలో కిలో వెండి రూ75,200 గా ఉంది.