ముకుంద జ్యూయలర్స్ సమర్పించు ఆగస్ట్ 31, గురువారం 2023 బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి..22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 55 వేలు 150 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ ల బంగారం 59 వేల 950 రూపాయలుగా వుంది..18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 45 వేల 120 రూపాయలుగా వుంది. హైదరాబాద్ లో వెండి కేజీ 78 వేల 4 వందలుగా వుంది.పండుగలు, పెళ్లిళ్ల సీజన్ అయినా కూడా బంగారం, వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి.కానీ ఇవాళ స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి రేటు 500 రూపాయల వరకూ పెరిగింది.నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఆంధ్రప్రదేశ్లో బంగారం, వెండి ధరలు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 55,000 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర ₹ 60,000 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 80,700 గా ఉంది. విశాఖపట్నం మార్కెట్లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. చెన్నైలో22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 55,300 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,330 కి చేరింది. కోయంబత్తూరులోనూ ఇదే రేటు అమల్లో ఉంది.ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 55,000 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,000 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.దిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 54,850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,820 గా నమోదైంది. జైపుర్, లఖ్నవూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.కోల్కతా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 55,000 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,000 గా ఉంది. నాగ్పుర్లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.బెంగళూరులో22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 55,000 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,000 గా ఉంది. మైసూరులోనూ ఇదే రేటు అమల్లో ఉంది.కేరళలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 55,000 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,000 గా ఉంది. వెండి ధరలు కూడా నేడు స్వల్పంగా పెరిగాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర గురువారం రూ. 77,600లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 500 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 77,600గా ఉండగా.. చెన్నైలో రూ. 80,700గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,750 ఉండగా.. హైదరాబాద్లో రూ. 80,700లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,700ల వద్ద కొనసాగుతోంది.