HomeBusinessహరిత విప్లవ పితామహుడు.. ఎంఎస్ స్వామినాథన్ ఇక లేరు

హరిత విప్లవ పితామహుడు.. ఎంఎస్ స్వామినాథన్ ఇక లేరు

Published on

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త MS స్వామినాథన్ కన్నుమూశారు. ఆయన వయసు 98ఏళ్ళు.. అనారోగ్యంతో చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు స్వామినాథన్.. . 1925 ఆగష్టు 7న మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణం ప్రాంతంలో జన్మించిన స్వామినాథన్ వ్యవసాయరంగంలో తనదైన ముద్రవేశారు. .ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు ఆయన విశేషంగా కృషి చేశారు. అధిక దిగుబడినిచ్చే వరి రకాలను అభివృద్ధి చేయడంలో స్వామినాథన్ కీలకపాత్ర పోషించారు. ఇది భారతదేశంలోని తక్కువ ఆదాయం గల రైతులు ఎక్కువ దిగుబడిని ఉత్పత్తి చేయడానికి సహాయపడింది. స్వామినాథన్ 1987లో చెన్నైలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారు. దాని ద్వారా ఆయన మొదటి ప్రపంచ ఆహార బహుమతిని అందుకున్నారు. స్వామినాథన్ అనేక అవార్డులను అందుకున్నారు. 1971లో రామన్ మెగసెసే అవార్డు, 1986లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు అందుకున్నారు. అలాగే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఇందిరా శాంతి బహుమతి, ఇందిరా జాతీయ సమైక్యతా పురస్కరాలు కూడా పొందారు. కాగా స్వామినాథన్‌కు భార్య మినా, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెల పేర్లు సౌమ్య స్వామినాథన్, మధుర స్వామినాథన్, నిత్యా స్వామినాథన్.స్వామినాథన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబీకులు సానుభూతి తెలిపారు.

Latest articles

More like this