ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త
కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డీఎస్సీ రెండో విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతీ ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామన్న హామీని నిలబెట్టుకుంది.

AP DSC 2026 Recruitment
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డీఎస్సీ రెండో విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతీ ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామన్న హామీని నిలబెట్టుకుంది. గతేడాది ఇప్పటికే 16వేల పోస్టులను భర్తీ చేసిన కూటమి సర్కార్.. ఇప్పుడు మరోసారి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,721 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు టీచర్ పోస్టుల భర్తీకి అధికారులు గ్రీన్ సిగ్నల్ (AP DSC 2026 Recruitment)ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఎంతో పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
2,721 పోస్టులతో డీఎస్సీ -2026ను నవంబర్ 3న ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్లోనే ఉంటుందని.. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. డీఎస్సీ సిలబస్‌ను tet2dsc.apcfss.in వైబ్ సైట్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. టీచర్ పోస్టుల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగులు(AP DSC 2026 Recruitment) ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తాజా విడుదల చేసిన డీఎస్సీ పోస్టుల్లో 350 ప్రత్యేక విద్య పోస్టులు ఉన్నాయి. ప్రకాశం, మార్కాపురం ఉమ్మడి జిల్లాల నిరుద్యోగులకు ఈనోటిఫికేషన్లో ఊరట లభించింది. ఉమ్మడి జిల్లాలోని 48 మండలాల ప్రతిపాదికన పోస్టులు ప్రకటించారు. వాటిలో రెండు జిల్లాలో 290 టీచర్ పోస్టులు ఉన్నాయి. అందులో 169 ఎస్జీటీలు ఉన్నాయి.
మరోవైపు డిగ్రీలు పాసై ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు మరో తీపి కబురు చెప్పింది కూటమి సర్కార్. APPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇప్పటికే 892 పోస్టులు భర్తీ కాగా.. మరో 1466 ఉద్యోగాలకు 10 ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేసింది. గ్రూప్ -2లో 686 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్ -2కు సంబంధించి పూర్తి స్థాయి నోటిఫికేషన్ నవంబర్ 9న విడుల చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. స్క్రీనింగ్ పరీక్ష 150 మార్కులకు నిర్వహించనున్నారు. మెయిన్స్ రెండు పేపర్లు .. ఒక్కోపేపర్ 150 మార్కుల చొప్పున 300మార్కులకు నిర్వహిస్తారు. నిరుద్యోగుల వయస్సును జులై ఒకటో తేదీని ప్రమాణికంగా తీసుకోనున్నారు. నాన్ యూనిఫాం ఉద్యోగుల దరఖాస్తుకు గరిష్ఠ వయోపరిమితి 44ఏళ్ల వరకు అవకాశం ఇచ్చారు. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు మరికొన్ని సడలింపులు ఇచ్చారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు జ్యాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తుండడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



