నీకు శానా కతుందిరా అబ్బాయ్!
సౌత్ ఇండియాలోనే పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్‌కో బ్రాండ్ ఉంది. కావ్యమారన్‌తో అతని పెళ్లి ఎనౌన్స్ కాగానే సింగర్ జోనితా గాంధీ లవ్ బ్రేకప్ సాంగ్ పోస్ట్ పెట్టింది. కొన్నేళ్లుగా అనిరుధ్‌తో జోనితా లవ్ ట్రాక్‌లో ఉంది. సరే ప్రేమలన్నీ పెళ్లి పీటలెక్కవు అనుకుందామంటే.. జోనితాతోనే కాదు చాలామందితో అనిరుధ్ లవ్ ట్యూన్లు కట్టాడు

Anirudh Ravichander Relationship Rumours
సంగీత దర్శకుడు అనిరుధ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. పెళ్లికూతురు ఎవరనుకున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ ఓనర్ కావ్యమారన్. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురు. ఇద్దరూ థర్టీ ప్లస్. అనిరుధ్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయగలడు. బాణీలు కట్టడంలోనే కాదు అమ్మాయిలను పటాయించడంలో కూడా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌కో స్పెషాలిటీ ఉంది. ఇప్పటిదాకా బ్యాచిలర్‌గా ఎన్ని ఎఫైర్స్ నడిపినా.. పెళ్లిపీటలు ఎక్కుతున్నాడన్న వార్త బయటికొచ్చేసరికి అనిరుధ్ ఒక్కో ఎకౌంట్ బయటపడుతోంది.
సౌత్ ఇండియాలోనే పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్‌కో బ్రాండ్ ఉంది. కావ్యమారన్‌తో అతని పెళ్లి ఎనౌన్స్ కాగానే సింగర్ జోనితా గాంధీ లవ్ బ్రేకప్ సాంగ్ పోస్ట్ పెట్టింది. కొన్నేళ్లుగా అనిరుధ్‌తో జోనితా లవ్ ట్రాక్‌లో (Anirudh Ravichander Relationship Rumours )ఉంది. సరే ప్రేమలన్నీ పెళ్లి పీటలెక్కవు అనుకుందామంటే.. జోనితాతోనే కాదు చాలామందితో అనిరుధ్ లవ్ ట్యూన్లు కట్టాడు. అనిరుధ్ కెరీర్ స్టార్టింగ్ నుంచే అతనిపై ఎన్నో రూమర్లు ఉన్నాయి. ఎన్నో లవ్ ఎఫైర్లు నడిచాయి. త్రీ సినిమా వైదిస్ కొలవెరి పాటతో గ్లోబల్ లెవల్‌లో పాపులర్ అయ్యాడు అనిరుధ్.
మ్యూజిక్ డైరెక్టర్‌గా ఒక్కో మెట్టూ ఎదుగుతూ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగాడు. కేవలం మ్యూజిక్‌పరంగానే కాకుండా పర్సనల్ లైఫ్‌పరంగా కూడా ఎప్పుడూ న్యూస్‌లోనే ఉన్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో నటి ఆండ్రియా జెరెమియాతో ఎఫైర్ డేటింగ్‌దాకా(Anirudh Ravichander Relationship Rumours ) వెళ్లింది. తర్వాత ఆమెకి బ్రేకప్ చెప్పేశాడు. ఆ తర్వాత పాపులర్ హీరోయిన్ కీర్తి సురేష్‌తో ప్రేమలో పడ్డాడని, త్వరలోనే వారిద్దరూ పెళ్లిచేసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే తర్వాత మరొకరితో కీర్తికి పెళ్లయిపోయింది.
ప్రియా భవానీశంకర్, పూజాహెగ్డేతో కూడా అనిరుధ్ డేటింగ్ చేస్తున్నాడని లోకం కోడైకూసింది. సన్నగా, స్టార్ట్‌గా ఉండే కుర్రోడు చాలామందిని పటాయించాడని అంతా చెవులు కొరుక్కున్నారు. కావ్యతో కొన్నాళ్లుగా లవ్‌లో ఉన్నాడు. చివరికి ఆమెనే పెళ్లి చేసుకుంటున్నాడు. మరి పెళ్లయ్యాకయినా ఎఫైర్లు, డేటింగ్‌లు పక్కనపెట్టి రాముడు మంచి బాలుడిలా ఉంటాడో లేదో చూడాలి.



