HomeNewsAndhra Pradeshఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నిందితుడిగా లోకేష్.. అరెస్ట్ చేస్తారా?

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నిందితుడిగా లోకేష్.. అరెస్ట్ చేస్తారా?

Published on

ఏపీలో రాజకీయం మూడు అరెస్టులు..నాలుగు రిమాండ్ల తరహాలో ఉంది. ఇప్పటికే మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో రిమాండులో ఉంచిన సంగతి తెలిసిందే. ఆయనకు బెయిల్ కోసం ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు నారా లోకేష్. ఇటు ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, బామ్మర్ది, వియ్యంకుడు బాలయ్యబాబు టీడీపీకి మద్దతు కూడగడుతున్నారు. మరోవైపు సీఐడీ దూకుడు పెంచిందనే చెప్పాలి.

కీలకమయిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంటు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను 14 వ నిందితుడిగా చేరుస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ కోర్టులో అధికారులు మెమో ఫైల్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబును సీఐడీ అధికారులు నిందితుడిగా చేర్చారు. చంద్రబాబు తర్వాత అరెస్ట్ లోకేష్ అంటున్నారు.

ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. తన తండ్రి చంద్రబాబును బెయిల్‌పై బయటకు రప్పించేందుకు తరచూ న్యాయవాదులతో టచ్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నారా లోకేష్‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. వైసీపీ నేతలు సైతం లోకేష్ కనిపించడం లేదని, ఢిల్లీలో ఎందుకు ఉన్నాడంటూ తరచూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లోకేష్‌ను సైతం అరెస్ట్ చేసేందుకు వైసీపీ కుట్ర చేస్తోందంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగుతున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంటు కేసులో లోకేష్‌ను నిందితుడి చేర్చడం ఆ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోందని న్యాయనిపుణులు అంటున్నారు. లోకేష్ ని కూడా అరెస్ట్ చేస్తే రాజకీయాలు మరింత హాట్ గా మారతాయని అంటున్నారు.

Latest articles

More like this