HomeBusinessయూపీఐ లైట్... ఇక మేడ్ ఈజీ

యూపీఐ లైట్… ఇక మేడ్ ఈజీ

Published on

డిజిటల్ పేమెంట్లు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక చర్యలు చేపట్టింది. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి డిజిటల్‌పేమెంట్‌యాప్‌లలో యూపీఐ లైట్‌వాలెట్‌వినియోగాన్ని మరింత ప్రోత్సహించాలని నిర్ణయించింది. ప్రతి ఆఫ్‌లైన్‌చెల్లింపు లావాదేవీ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 200 నుంచి రూ. 500కు పెంచింది. యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై చిన్న మొత్తాల చెల్లింపును వేగవంతం చేసేందుకు 2022 సెప్టెంబర్‌లో యూపీఐ లైట్‌ప్రవేశపెట్టారు. ఇంటర్నెట్‌అంతంత మాత్రంగా ఉండే ప్రాంతాలు, అలాగే అసలు నెట్‌ఉండని ప్రదేశాల్లో కూడా రిటైల్‌డిజిటల్‌చెల్లింపు లావాదేవీల నిర్వహణకు ఇది ఉపయోగపడుతుంది.బ్యాంకుల ప్రాసెసింగ్‌వ్యవస్థలపై కూడా భారం తగ్గించడం వల్ల లావాదేవీలు ఫెయిల్ కావు. యూపీఐ లైట్ ద్వారా నెలకు 1 కోటికి పైగా లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా వేశారు.

Latest articles

More like this