HomeNewsAndhra Pradeshఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Published on

ఈరోజుల్లో సెల్ ఫోన్లు, ట్యాబ్ లు, ఐపాడ్ ల వినియోగం బాగా పెరిగిపోయింది. స్కూళ్ళు, కాలేజీల్లోనూ విద్యార్ధులు వీటిని బాగా ఉపయోగిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం వీటి వాడకంపై ఆంక్షలు విధించింది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్‌ఫోన్ల వాడకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాలలకు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తేవటంపై పూర్తి నిషేధం విధిస్తూ మోమో జారీ చేసింది. ఉపాధ్యాయులు సైతం తరగతి గదుల్లోకి ఫోన్లు తీసుకురాకూడదని పేర్కొంది. టీచర్లు తరగతి గదులకు వెళ్లేముందు తమ మొబైల్స్‌ను ప్రధానోపాధ్యాయుడికి అప్పగించాలి. బోధనకు ఎటువంటి ఆటంకం రాకుండా ఉండేందుకు యునెస్కో నిబంధనలను అనుసరిస్తూ  ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలంటున్నారు అధికారులు.

Latest articles

More like this