ఈ వార్త విన్నవారు చాలా హ్యాపీగా ఫీలవుతారు. వంటింట్లో ఇక టమోటాలు కనిపించే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. టమోటా ధర తగ్గుముఖం పడుతోంది. ఏపీలో మదనపల్లె మార్కెట్‌యార్డులో టమాటా ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత నెల 30న మార్కెట్ చరిత్రలోనే కిలో టమాటా అత్యధికంగా రూ.196 పలికిన సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా మార్కెట్‌కు దిగుబడి స్వల్పంగా పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని అధికారులు, వ్యాపారులు చెబుతున్నారు.
ఈనెల9వ తేదీన బుధవారం అత్యధికంగా కిలో టమాటా రూ.100 వరకు ఉంది. గురువారం ఈ ధరలు ఒక్కసారిగా తగ్గాయి. ఇవాళ ఏ గ్రేడ్ కిలో టమాటా రూ.50 నుంచి రూ.64 వరకు, బీ గ్రేడ్ రూ.36 నుంచి రూ.48 వరకు ఉంది. సగటున కిలో టమాటా రూ.44 నుంచి రూ.60తో వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. మరోవారంలో టమోటా ధరలు తగ్గుతాయని, అందరికీ అందుబాటులోకి వస్తాయంటున్నారు.
మదనపల్లి మార్కెట్లో తగ్గిన టమోటా ధరలు.. ఇవాళ ఏ గ్రేడ్ కిలో టమాటా రూ.50 నుంచి రూ.64, బీ గ్రేడ్ రూ.36 నుంచి రూ.48, సగటున కిలో టమాటా రూ.44 నుంచి రూ.60తో రైతులనుంచి కొంటున్న వ్యాపారులు.. మరోవారంలో టమోటా ధరలు తగ్గుతాయంటున్న వ్యాపారులు