సంచలనం కలిగిస్తున్న సర్వే
ఏపీలో రాబోయే ఎన్నికల్లో ఎవరికి అధికారం దక్కుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో అనేక సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ హల్ చల్ చేశాయి. 2024 ఎన్నికలలో అధికార వైసీపీదే మళ్లీ అధికారం అని ఒక సర్వే చెబుతోంది. 175 స్థానాలకు 175 స్థానాలు సాధించాలని జగన్ బిగ్ టార్గెట్ పెట్టుకున్నారు. ఇందుకోసం 40 నుంచి 50 స్థానాల్లో సిట్టింగ్ లను కూడా మార్చాలని భావిస్తున్నారు జగన్.
ఏపీ ఎన్నికలలో 116-118 వైసీపీ గెలవనుంది అని విపక్ష టీడీపీకి అధికారం దక్కదని జన్మత్ పోల్స్ సంస్థ వెల్లడించింది. ఈసర్వే ప్రకారం టీడీపీ+జనసేన కూటమికి 46-48 స్థానాలు మాత్రమే లభిస్తాయని తెలిపింది. ఈ సర్వే సంస్థ చెప్పినట్టుగానే తెలంగాణ ఫలితాలు కూడా వచ్చాయి.. దీనిబట్టి చూస్తే రానున్న 2024లో జగనే సీఎం అని తెలుస్తుంది. 2023 నవంబర్ 30 తెలంగాణలో పోలింగ్ జరిగింది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కుతుందని జన్మత్ పోల్స్ సంస్థ తెలిపింది. ఆ సంస్థ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 61 నుంచి 63 స్థానాలు వస్తాయని పేర్కొనగా నూటికి నూరుపాళ్ళు సర్వే నిజమయింది. అంతేకాదు సంస్థ తెలిపిన విధంగా 64 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోగా, దాని మిత్రపక్షం సీపీఐ ఒకస్థానాన్ని గెలుచుకుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి 45 నుంచి 47 సీట్లు వస్తాయని సర్వే చెప్పింది. అయితే, వాస్తవానికి ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలు గెలిచిన సంగతి తెలిసిందే. ఇక మజ్లిస్ పార్టీకి ఆరు నుంచి 7 సీట్లు వస్తాయని తెలిపింది. ఇతరులు 1 లేదా 2 వస్తారని పేర్కోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే జన్మత్ పోల్స్ అంచనా ప్రకారం 4 నుంచి 5 సీట్లు వస్తాయని సర్వేలో తెలపగా.. వాస్తవంగా ఆ పార్టీకి 8 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిని బట్టి చూస్తే ఏపీలో సర్వే ఫలితాలు కూడా జన్మత్ విశ్వసనీయతకు నిదర్శనంగా నిలుస్తాయని అంటున్నారు.