బిగ్ బాస్ 7 తెలుగు విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్..
గజ్వేల్ మండలం కొల్గూరులో అరెస్ట్
అన్నపూర్ణ స్టూడియో దగ్గర గొడవ నేపథ్యంలో అరెస్ట్
బిగ్ బాస్ 7 తెలుగు విజేత పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ 7 తెలుగు విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేశారు. గజ్వేల్ మండలం కొల్గూరులో అరెస్ట్ చేసిన పోలీసులు.. అన్నపూర్ణ స్టూడియో దగ్గర గొడవ నేపథ్యంలో అరెస్ట్ చేశారు. ఈ సీజన్లో కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. అయితే టైటిల్ విన్నర్‌గా నిలిచిన ప్రశాంత్.. ఆ రాత్రి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. కొందరి సెలెబ్రిటీలా కార్లు ద్వంసం అయ్యాయి. దీంతో అతనిపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న ప్రశాంత్ ని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.