తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడుగంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదు అయింది.
అత్యధికంగా మెదక్ జిల్లాలో- 50.8 శాతం
అత్యల్పంగా హైదరాబాద్లో- 20.79 శాతం
ఆదిలాబాద్- 41.88 శాతం
భద్రాద్రి-39.29 శాతం
హనుమకొండ-35.29 శాతం
జగిత్యాల- 46.14 శాతం
జనగామ- 44.31 శాతం
భూపాలపల్లి- 49.12 శాతం గా పోలింగ్ నమోదైంది.
గతంలో 2018, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏమేరకు పోలింగ్ జరిగిందో ఒకసారి చూద్దాం. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ తక్కువ ఉండడం చాలా కాలం నుంచి జరిగేదే. కానీ హైదరాబాద్ నగరంలో ఓటింగ్ మరీ దారుణంగా పడిపోతూ వస్తోంది. మొన్నటి వరకూ చదువుకున్న వారు ఓటెయ్యరన్న అపవాదు ఉండేది.హైదరాబాద్లో ఉంటున్న చాలా మంది నగరంలో ఒక ఓటు, తమ సొంతూళ్లలో ఒక ఓటు ఉంచుకుంటారు. హైదరాబాద్లో ఉన్న ఓటును ఐడీ ప్రూఫుగా వాడుతూ.. ఊరిలో ఓటు వేసే వారు చాలా మంది ఉన్నారు. పల్లెల్లో ఎవరు ఓటు వేశారు? ఎవరు వేయలేదు? అన్న లెక్క సులువుగా తేలిపోతుంది. కులం, గ్రూపు, వర్గం, వీధి, కుటుంబం – ఇలా చాలా అంశాల ఆధారంగా రాజకీయం జరుగుతుంది కాబట్టి, స్థానిక నాయకులకు చాలా మంది గుర్తుంటారు కాబట్టి అక్కడ ఓటు వేయడానికి ఇష్టపడతారు ఓటర్లు.2014, 2018 ఎన్నికల్లో హైదరాబాద్ లో నమోదైన పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే అనేక విభ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి.
హైదరాబాద్ లో ఓటు వేసినా వేయకపోయినా అడిగేవారు ఉండరన్న భావన కొందరిలో ఉంటుంది.
ఆదిలాబాద్ జిల్లాలో 2018లో 81శాతం పోలింగ్ నమోదైంది. 2014లో మాత్రం 74 శాతం నమోదైంది. అంటే 7 శాతం పెరిగింది. ఈసారి ఎంత ఉంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది.
నిజామాబాద్ లో 2018లో 79శాతం పోలింగ్ నమోదు కాగా.. 2014లో 72 శాతం నమోదైంది. అంటే ఏడుశాతం పెరిగింది.
కరీంనగర్ లో 2018లో 70 శాతం పోలింగ్ నమోదు కాగా 2014లో మాత్రం 72 శాతం నమోదైంది. మైనస్ 2 శాతం తగ్గింది.
మహబూబ్నగర్లో 2018 ఎన్నికల్లో 82శాతం నమోదుకాగా.. 2014లో 73 శాతం నమోదైంది. అంటే 9శాతం ఎక్కువగా నమోదైంది.
నల్గొండలో 2018లో 87 శాతం 2014లో 80శాతం పోలింగ్ నమోదైంది. గతంలో కంటే ఏడుశాతం ఎక్కువగా నమోదైంది.
వరంగల్ జిల్లాలో 2018లో 83 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2014లో కేవలం 79 శాతం అంటే 4శాతం ఎక్కువగా నమోదైంది
ఖమ్మం జిల్లాలో 2018 ఎన్నికల్లో 87శాతం నమోదు కాగా.. 2014 ఎన్నికల్లో 81 శాతం నమోదైంది. 6 శాతం ఎక్కువగా నమోదైంది.
హైదరాబాద్ 2018 ఎన్నికల్లో 50 శాతం పోలింగ్ నమోదైంది. 2014 ఎన్నికల్లో 53 శాతం పోలింగ్ నమోదైంది.
మెదక్ 2018 ఎన్నికల్లో 84శాతం పోలింగ్ నమోదైంది. 2014 ఎన్నికల్లో 77 శాతం నమోదైంది. ఏడుశాతం పోలింగ్ పెరిగింది.
రంగారెడ్డి 2018 ఎన్నికల్లో 62శాతం నమోదైంది. 2014 ఎన్నికల్లో 58శాతం అంటే నాలుగుశాతం పెరిగింది.
2018 ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం 73 శాతం నమోదుకాగా 2014 ఎన్నికల్లో 69 శాతం నమోదయింది. అంటే 4 శాతం ఎక్కువగా పోలింగ్ నమోదు అయింది.