దేశవ్యాప్తంగా టమోటా ధరల మంట కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా టమోటా తోటలు దెబ్బ తిన్నాయి.ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి టమోటాల సరఫరా గణనీయంగా తగ్గింది. గతంతో పోలిస్తే రైతులు టమోటా సాగు తగ్గించారని తెలుస్తుంది. హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి టమోటా సరఫరా తగ్గిపోవడంతో వారంలో హోల్‌సేల్ మార్కెట్లలో ఢిల్లీలో టమోటా ధరలు రెట్టింపయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో 160 నుంచి 180 రూపాయల వరకూ ధర పలుకుతోంది. ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు ఏపీలోని జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది.
రైతుబజార్లలో రాయితీ ధరలకు టమాటాను విక్రయించనున్నట్టు వ్యవసాయ మార్కెటింగ్ శాఖాధికారులు తెలిపారు. కిలో రూ.50 చొప్పున మనిషికి కిలో మాత్రమే ఇస్తామంటున్నారు. వీటిని అన్ని రైతుబజార్లలో విక్రయిస్తున్నారు. ఏపీలోని 13 రైతుబజార్లకు అక్కడ డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ చేశానారు. రోజుకు ఒక కుటుంబానికి ఒక్కసారే ఇస్తారని, అదే కుటుంబ సభ్యులు మళ్లీ క్యూలో నిల్చోవద్దని అధికారులు సూచించారు. కిలో 50 రూపాయలకు టమోటా దొరకడంతో వినియోగదారులు క్యూ కడుతున్నారు.