కాంగ్రెస్ ఎన్ఆర్ఐ నాయకురాలు ఝాన్సీరెడ్డికి షాక్ తగిలింది..ఝాన్సీ రెడ్డికి భారత పౌరసత్వం నిరాకరించింది. పౌరసత్వం నిరాకరించడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హత ఏర్పడింది. పౌరసత్వం లభించకపోయినా ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు ఝాన్సీరెడ్డి. పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు ఝాన్సిరెడ్డి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం మరోసారి హైలైట్ అయ్యింది. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో పాలకుర్తి విషయమై కీలక నిర్ణయం తీసుకుంది.పాలకుర్తి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి బరిలో దిగుతారని అందరూ ఆశించారు. అయితే. చివరి నిమిషంలో ఝాన్సీ భారత పౌరసత్వంపై ఆదేశాలు వచ్చాయి. ఆమెకి పౌరసత్వం నిరాకరించింది భారత ప్రభుత్వం. దీంతో స్క్రీనింగ్ కమిటీ ఈ విషయంపై ఫోకస్ పెట్టింది.
ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి పౌరసత్వం విషయంలో సమస్య కారణంగా ఆమెకు బదులుగా ఝాన్సీ కోడలు యశస్వినీ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు స్క్రీనింగ్ కమిటీ యశస్వినీ పేరును ప్రతిపాదించనుంది. పాలకుర్తి నియోజకవర్గం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఓటమి ఎరుగని నేతగా పేరుతెచ్చుకున్న ఎర్రబెల్లికి ఈసారి చుక్కలు చూపించేందుకు కాంగ్రెస్ భారీ కసరత్తే చేస్తోంది. ఆయనను ఈసారి ఓడించేందుకు కాంగ్రెస్ ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబసభ్యులను బరిలోకి దింపనున్నారు. ఝాన్సీరెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతోపాటు మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి సహకారం కూడా ఉంది. మంత్రి ఎర్రబెల్లికి సైతం జనం నుంచి వ్యతిరేక ఉండడంతో నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు.తాజాగా ఝాన్సీరెడ్డి పోటీచేసే అవకాశం లేకపోవడంతో ఆమె కోడలు యశస్వినీ రెడ్డిని రంగంలోకి దింపుతారని భావిస్తున్నారు.