HomeNewsమునుగోడు నుంచే పోటీ.. రాజగోపాల్ రెడ్డి క్లారిటీ

మునుగోడు నుంచే పోటీ.. రాజగోపాల్ రెడ్డి క్లారిటీ

Published on

తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి జోష్ వచ్చింది. బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను మునుగోడులోనే పోటీ చేస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ద్వారానే సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పుకొచ్చారు. తాను తెలంగాణ కోసం పోరాడానని గుర్తు చేశారు రాజగోపాల్ రెడ్డి. నాటి పరిస్థితుల దృష్ట్యా బీజేపీలోకి వెళ్లానని… కానీ బీఆర్ఎస్ పై పోరాటం చేసే విషయంలో బీజేపీ డీలా పడిపోయిందన్నారు. ప్రజల కోసమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెప్పారు. కేసీఆర్ ను గద్దె దించటమే తన లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తే… గజ్వేల్ బరిలోనూ ఉంటానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. దమ్ముంటే కేసీఆర్… మునుగోడులో పోటీ చేయాలని సవాల్ విసిరారు.

ఆత్మగౌరవం దక్కాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు.ప్రజాస్వామ్య పాలన రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. అక్టోబరు 27వ తేదీన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతానని చెప్పారు.పార్టీ కార్యకర్తల ఒత్తిడితోనే పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. బీజేపీ తొలి జాబితాలోనే పేరు వచ్చేది కానీ… తన పేరు పెట్టవద్దని జాతీయ నాయకత్వాన్ని కోరారని తెలిపారు.ప్రజల కోసమే పార్టీ మారనని… ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. తన రాజకీయ జీవితంలో ఇదే అతిపెద్ద నిర్ణయమని పేర్కొన్నారు.కవితను అరెస్ట్ చేయకుండా బీజేపీ తప్పుచేసిందన్నారు.

Latest articles

More like this