HomeNewsరేవంత్ కి షర్మిల సవాల్.. కొడంగల్ నుంచి పోటీ?

రేవంత్ కి షర్మిల సవాల్.. కొడంగల్ నుంచి పోటీ?

Published on

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ ఇప్పుడు షర్మిల.. నిన్నమొన్నటివరకూ షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనం అయిపోతోందని అన్నారు. కానీ ఏం జరిగిందో ఏమో ఆ ప్రతిపాదన ముందుకి సాగలేదు. తాజాగా బీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితా విడుదల కావడం, బీఫారాలు కూడా ఇవ్వడంతో వేడి మరింత రాజుకుంది. 55 మందితో కాంగ్రెస్ అభ్యర్దుల తొలి జాబితా విడుదలైంది. రెండవ విడత అభ్యర్దుల జాబితా తుది దశకు చేరుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ లక్ష్యంగా సొంత పార్టీ సీనియర్లు టార్గెట్ చేస్తూ..పార్టీని వీడుతున్నారు. వైఎస్ షర్మిల ఒంటరిపోరుకి సిద్ధం అయిన సంగతి తెలిసిందే. తాను పాలేరు నుంచి భర్త బ్రదర్ అనిల్ సికింద్రాబాద్ నుంచి, తల్లి విజయలక్ష్మి మిర్యాలగూడ నుంచి పోటీచేస్తారని వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన షర్మిల రెండో స్థానం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. షర్మిల ఇప్పుడు కొడంగల్ నుంచి పోటీకి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. కొడంగల్ సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఈ ఎన్నికల్లో మరోసారి గులాబీ పార్టీ అభ్యర్దిగా పోటీ చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఈ ఎన్నికల్లో రేవంత్ కు ఇక్కడ గెలుపు కీలకం కానుంది. ఈ సమయంలోనే కొడంగల్ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.వైఎస్సార్టీపిని కాంగ్రెస్ లో విలీనం చేయటానికి సిద్దపడినా..రేవంత్ కారణంగానే షర్మిల ప్రతిపాదనలను కాంగ్రెస్ అమోదించలేదని చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో షర్మిల జోక్యం వద్దంటూ రేవంత్ తన మద్దతు దారులతో కాంగ్రెస్ హైకమాండ్ వద్ద బలంగా వాదించారు. తాను తెలంగాణకే పరిమితం అవుతానని షర్మిల తేల్చి చెప్పారు. ఫలితంగా కాంగ్రెస్ తో షర్మిల ప్రయత్నాలు ఫలించలేదు.

దీంతో, ఇప్పుడు రేవంత్ కు కొడంగల్ లోనే షాక్ ఇవ్వాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని షర్మిల ప్రకటించారు. తొలి నుంచి చెబుతున్నట్లుగా పాలేరు తో పాటుగా మరో స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కొడంగల్ లో సామాజిక – ప్రాంతీయ సమీకరణలు తనకు కలిసి వస్తాయని అంచనా వేస్తున్న షర్మిల..ఇప్పటికే అక్కడ సర్వేలు చేయించారనే ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి 2014లో కొడంగల్ లో గెలిచారు. ఇప్పుడు రేవంత్ ను ఓడించేందుకు బీఆర్ఎస్ పక్కా వ్యూహాలు అమలు చేస్తోంది. తాజాగా రేవంత్ టార్గెట్ గా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. షర్మిల కొడంగల్ లో పాదయాత్ర చేసిన సమయంలోనూ రేవంత్ పై విమర్శలు చేశారు. మంత్రి కేటీఆర్ కూడా కీలక వ్యాఖ్యలు చేసారు. ఓటుకు నోటు కేసును ప్రస్తావించారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి ఆ సమయంలో షర్మిలకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు గుర్నాధరెడ్డి తిరిగి కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తున్నా..షర్మిల బరిలో ఉంటే ఆయన పాత్ర కీలకం అవుతుందని భావిస్తున్నారు. రేవంత్ వర్సస్ పట్నం మధ్య పోటీలో షర్మిలకు కలిసి వస్తుందనేది వైఎస్సార్టీపి నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో, సర్వే ఫలితాల ఆధారంగా షర్మిల కొడంగల్ పైన తుది నిర్ణయం ప్రకటిస్తారని అంటున్నారు. అదే గనుక జరిగితే పోటీ రసవత్తరంగా ఉంటుందని అంటున్నారు.

Latest articles

More like this