HomeNewsAndhra Pradeshచంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా

Published on

మాజీ సీఎం చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ వాయిదా పడింది…ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. తదుపరి విచారణు వచ్చే మంగళవారం (అక్టోబర్17) మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది సుప్రీంకోర్ట్. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. చట్టసవరణ ముందు కేసు కాబట్టే 17ఏ వర్తించదని తన వాదన అని ముకుల్ రోహత్గి చెప్పుకొచ్చారు. 17ఏ అనేది పుట్టక ముందే నేరం జరిగింది కాబట్టి ఈ కేసుకు చట్టసవరణ వర్తించదని అన్నారు. 2018 జులైలో చట్టసవరణ జరిగిందని.. 2014, 2015 కేసులకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పరిగణించలేం అన్నారు ముకుల్ రోహత్గీ. చంద్రబాబు నిర్ణయం తనే తీసుకున్నానని అంగీకరిస్తేనే 17ఏ వర్తిస్తుందని ముకుల్ వాదించారు. తనకు సంబంధం లేదని అంటూనే అధికార విధుల్లో భాగంగానే ఇదంతా చేసానని చంద్రబాబు ఎలా చెబుతారు అంటూ ముకుల్ రోహత్గీ అన్నారు.

Latest articles

More like this