HomeNewsTelanganaపాలేరులో షర్మిల...మిర్యాలగూడలో విజయమ్మ…సికింద్రాబాద్ లో బ్రదర్ అనిల్

పాలేరులో షర్మిల…మిర్యాలగూడలో విజయమ్మ…సికింద్రాబాద్ లో బ్రదర్ అనిల్

Published on

ఒక కుటుంబం మూడుచోట్ల పోటీ.. భలేగా ఉంది కదా. దివంగత వైఎస్ కూతురు వైఎస్ షర్మిల సింగిల్ గానే పోటీచేయాలని నిర్ణయించడమే కాదు. ఫ్యామిలీ మొత్తం పోటీచేయాలని భావిస్తోంది. విజయమ్మ, బ్రదర్ అనిల్ కూడా షర్మిలతో పాటు ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణ హాట్ టాపిక్ అవుతోంది. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచే షర్మిల పోటీ చేయబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి లోటస్ పాండ్‌లో వైస్సార్టీపీ కీలక నేతలతో షర్మిల అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనే అంశంపై పార్టీ క్యాడర్‌తో చర్చిస్తున్నారు.

ఈరోజు నుంచే ఎన్నికల బరిలోకి దిగేలా షర్మిల ప్లాన్ చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ.. ప్రచారంపై కార్య కర్తలకు దిశానిర్దేశం చేశారు. మిర్యాలగూడ, పాలేరు సీట్లలో ఒకచోట పోటీచేయాలని భావించినా చివరకు పాలేరుని ఎంపిక చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం అంశం కథ కంచికి చేరింది. వివిధ కారణాల వల్ల షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయలేదు. కాంగ్రెస్ లో వైఎస్సార్ టీపీ విలీనానికి బ్రేక్ పడడంతో ఆ పార్టీ చీఫ్ షర్మిల కొత్త కార్యాచరణను తెరమీదకు తెచ్చారు.

నాలుగు నెలల పాటు ప్రయత్నించినా సానుకూల వాతావరణం ఏర్పడకపోవడంతో అన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్టు వైఎస్సార్టీపీ ప్రకటించింది. ఇందుకోసం దరఖాస్తుల స్వీకరణను కూడా ఇవాళ్టి నుంచి ప్రారంభించింది. కనీసం 30నుంచి నలభై సెగ్మెంట్లలో నాలుగైదు వేల ఓట్లు చీల్చి గెలుపోటములను తారుమారు చేసే ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం.చర్చోపర్చల తర్వాత షర్మిల ఒంటరి పోరుకు రెడీ అయ్యారు. అన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులను బరిలోకి దింపాలని నిర్ణయించారు. ఇందుకోసం వైఎస్సార్టీపీ రాష్ట్ర కార్యవర్గం ఇవాళ లోటస్ పాండ్ లోని షర్మిల నివాసంలో భేటీ అయ్యింది. మ్యానిఫెస్టో రెడీ చేసేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీని సైతం ఏర్పాలు చేసింది. రెండో రోజుల్లో మేనిఫెస్టోను విడుదల చేసేందుకు వైఎస్సార్టీపీ రెడీ అవుతోంది. తన తల్లి వైఎస్ విజయమ్మను ఎన్నికల బరిలోకి దింపనున్నారు. విజయమ్మ మిర్యాలగూడ స్థానం నుంచి ఆమె పోటీ చేయనున్నారు.

సికింద్రాబాద్ సెగ్మెంట్ నుంచి తన భర్త బ్రదర్ అనిల్ పోటీ చేయనున్నారు. క్రిస్టియన్ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం బాగా కలిసి వస్తుందని షర్మిల అంచనా వేస్తున్నారు. తాను పాలేరు నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. నియోజక వర్గాల వారీగా పలువురు అభ్యర్థుల పేర్లు ఖరారు చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. సూర్యాపేట నుంచి పిట్ట రాంరెడ్డి, సత్తుపల్లి నుంచి కవిత, బోధన్ నుంచి సత్యవతి, కల్వకుర్తి నుంచి అర్జున్ రెడ్డి, వనపర్తి నుంచి వెంకటేశ్వర రెడ్డి, నర్సంపేట నుంచి శాంతికుమార్, అదిలాబాద్ నుంచి బెజ్జంకి అనిల్, చేవెళ్ల నుంచి దయానంద్, గజ్వేల్ నుంచి రామలింగారెడ్డి, సిద్దిపేటలో నర్సింహారెడ్డి, సిరిసిల్లలో చొక్కాల రాము, కామారెడ్డి నుంచి నీలం రమేశ్, అంబర్ పేట నుంచి గట్టు రామచంద్రరావును ఎన్నికల బరిలో నిలిపేందుకు వైఎస్ఆర్టీపీ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇవాళ్టి నుంచి 119 సెగ్మెంట్లలో ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది.

Latest articles

More like this