తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో తెలంగాణలో పార్టీలు ఎన్నికల సమరానికి సై అంటున్నాయి. ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం విజయవాడలో జరిగిన వైసీపీ ప్రతినిధుల సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ల్లో ఎన్నికలు ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు. మార్చిలో ఎన్నికలకు సన్నద్ధం అవుతామని పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడుతామని తెలిపారు. ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ల ఆధ్వర్యంలో డిసెంబర్ 31వ తేదీ వరకు బస్సు యాత్ర కొనసాగుతుందన్నారు. ప్రతిరోజు మూడు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబర్ 11 నుండి జనవరి 15వ తేదీ వరకు ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం చేపటడతామన్నారు. జనవరి 1వ తేదీన వృద్ధాప్య పెన్షన్ రూ. 3వేలకు పెంచుతామని జగన్ గుడ్ న్యూస్ చెప్పారు.