రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. రూ.2వేల నోట్ల మార్పిడికి గడువును పెంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అక్టోబర్ 7వ తేదీ వరకూ గడువును పెంచింది ఆర్బీఐ… గడువు తేదీలోగా సమీప బ్యాంకుల్లో మార్చుకోవచ్చని తెలిపిన ఆర్బీఐ.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. రూ.2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రూ.2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోనున్నట్లు తెలిపింది. ఇకపై వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. నోట్లు ఉన్నవారు సెప్టెంబరు 30లోపు మార్చుకోవాలని వినియోగదారులకు సూచించింది.ఈ గడువును ప్రస్తుతం వారం రోజుల పాటు పెంచింది.